Renu Desai Pawan Kalyan Politics : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్ అయ్యారు. రీసెంట్గా ఆమె.. 'బ్రో' సినిమా రాజకీయంగా వివాదాలను ఎదుర్కొన్న సమయంలో పవన్‌ను, అలాగే ఆయన్ను విమర్శిస్తూ చేస్తున్నవారిపై ఓ వీడియో బైట్ రిలీజ్ చేసింది. అందులో వ్యక్తిగతంగా పవన్ మోశం చేశారని చెబుతూనే రాజకీయంగా పవన్‌కే తన మద్దతు అని తెలిపింది. అయితే దీనిపై ప్రతివిమర్శలు కూడా వచ్చాయి. తాజాగా మళ్లీ తనపై వస్తున్న ఆరోపణలకు రేణు స్పందించింది. ఓ సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చింది.
Renu Desai Recent Post : "నా విడాకుల విషయంలో నా మాజీ భర్త ఎలా మోసం చేశారనే నిజాన్ని మాట్లాడితే గతంలో ఆయన అభిమానులు చాలా దారుణంగా అసభ్యపదజాలంతో తిట్టారు. ఇప్పుడు ఓ దేశ పౌరురాలిగా ఆయనకు అనుకూలంగా కొన్ని నిజాలు మాట్లాడినప్పుడు ఆయన్ను ద్వేషించేవారు ఇప్పుడు నన్ను తిడుతున్నారు. గతంలో విడాకుల విషయంలో నా మాజీ భర్త గురించి మాట్లాడినప్పుడు.. డబ్బులు తీసుకుని అలా అన్నానని ఆరోపించారు. ఇప్పుడు కూడా అలానే అంటున్నారు. అప్పుడు,ఇప్పుడు రెండు సందర్భాల్లోనూ నిజాన్నే చెప్పాను. ఒక్క మాట తప్పుగా చెప్పలేదు. ప్రేమలో పడి నిజం మాట్లాడినందుకు నేను చెల్లించాల్సిన మూల్యం ఇదేనని అనుకుంటున్నాను. ఇదే నా విధి అయితే అలాగే ఉండనీయండి. ఇంకా అనండి నన్ను" అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Bro Movie Controversy : అంతకుముందు వీడియో బైట్‌లో రేణూ దేశాయ్ మాట్లాడుతూ.. "ఇటీవలె విడుదలైన సినిమా కాంట్రవర్సీలకు దారితీసింది. ఇదంతా జరిగినప్పుడు నేను దేశంలో లేను. తిరిగి వచ్చిన తర్వాతే తెలిసింది. కొందరు వ్యక్తులు నా మాజీ భర్త. వ్యక్తిగత విషయాలు, పెళ్లి, పిల్లలనుద్దేశించి వెబ్ సిరీస్‌లు తీస్తామంటున్నారు. ఓ తల్లిగా చెబుతున్న పిల్లలను దయచేసి పిల్లలను ఇందులో లాగకండి" అని రేణూ అన్నారు.
Renu Desai Pawan Kalyan Relationship : "నా విషయంలో జరిగింది వంద శాతం తప్పే. కానీ నాకు తెలిసిన, నేను చూసినంత వరకూ.. పవన్ డబ్బు ఆశించే వ్యక్తి కాదు. ఎల్లప్పుడూ సమాజానికి మంచి చేయాలని పరితపించే మనిషి. ఆయన అరుదైన వ్యక్తి. నేను నా వ్యక్తిగత విషయం పక్కనపెట్టి రాజకీయంగా మద్దతిచ్చాను, ఇస్తున్నాను కూడా. సొసైటీ కోసం.. ఆయన వ్యక్తిగత జీవితం పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఓ సక్సెస్ఫుల్ నటుడు. దయచేసి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి. ప్రతిసారీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండి. మూడు పెళ్లిళ్లపై చర్చ దయచేసి ఆపండి. నా పిల్లలనే కాదు, మిగిలిన ఇద్దరు పిల్లలను ఇలాంటి వాటిల్లోకి లాగకండి. ఎందుకంటే వాళ్లు ఇంకా చిన్నపిల్లలే" అని ఆమె చెప్పారు. దీంతో రేణూ డబ్బులు తీసుకుని పవన్‌కు సపోర్ట్‌గా మాట్లాడిందనే కామెంట్స్ ఈ మధ్య వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా మరోసారి స్పందించింది.
Renu Desai Pawan Kalyan : పవన్‌కే నా సపోర్ట్.. ఒక్క అవకాశం ఇద్దాం : రేణూ దేశాయ్
అమ్మ కోసం అకీరా స్పెషల్ గిఫ్ట్.. ఇది భయపెట్టేస్తుంది అంటూ పోస్ట్!