ETV Bharat / entertainment

'సీతను తీసుకెళ్లాలంటే సముద్రం కాదు.. ఈ రావణుడిని దాటాలి'.. రావణాసుర టీజర్ ​రిలీజ్​ - రావణాసుర లేటెస్ట్ న్యూస్

RaviTeja Ravanasura : మాస్​ హీరో రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం 'రావణాసుర'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్​ను విడుదల చేసింది చిత్ర బృందం.

ravi teja ravanasura
ravi teja ravanasura
author img

By

Published : Mar 6, 2023, 3:34 PM IST

RaviTeja Ravanasura : మాస్​మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం రావణాసుర. ఇటీవలే విడుదలైన ధమాకా, వాల్తేర్ వీరయ్య చిత్రాలతో ఘన విజయాన్ని అందుకున్న రవితేజ హ్యాట్రిక్​పై కన్నేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్​ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో రవితేజ లాయర్​గా కనిపించనున్నారు. ఈ టీజర్​లో డైలాగులు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే 'సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు. ఈ రావణాసురిడిని దాటి వెళ్లాలి' అంటూ రవితేజ చెప్పిన డైలాగ్​ అదిరిపోయింది. టీజర్​ను చాలా ఇంట్రస్టింగ్​గా కట్ చేసింది చిత్ర యూనిట్​. ఇందులో రవితేజ కొద్దిగా వైలెంట్​గా చూపించారు.

సుధీర్​ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాశ్​, అను ఇమ్మాన్యుయేల్​, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్​ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరో సుశాంత్​ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. రావు రమేశ్, మురళీ శర్మ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రవితేజ, అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్దన్‌ రామేశ్వర్‌, భీమ్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక రవితేజ సినిమాల విషయానికొస్తే.. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. గాయత్రి భరద్వాజ్‌, నూపూర్‌ సనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. రేణూ దేశాయ్‌ కీలక పాత్ర పోషించారు. స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 1970ల నేపథ్యంలో సాగుతుంది. ఈ పాత్ర కోసం రవితేజ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు.

ఇవీ చదవండి : NTR 30 క్రేజీ అప్డేట్​.. హీరోయిన్​గా 'బర్త్​డే' గర్ల్​.. ఫస్ట్​ లుక్​ చూశారా?

నాలుగు పదాలతో ట్వీట్​.. నెట్టింట ఫుల్​ ట్రెండింగ్​.. 'స్నేహ' క్రేజ్​ మాములుగా లేదుగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.