TarunBhaskar Panchatantra kathalu song: నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్ ప్రధాన పాత్రల్లో ఐదు వేరు వేరు కథలతో యువ దర్శకుడు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం 'పంచతంత్ర కథలు'. మధు క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలోని తొలి పాటను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. 'నేనేమో మోతవరి' అంటూ సాగే ఈ పాటకు కమ్రాన్ సంగీతాన్ని అందించగా రామ్ మిర్యాల ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ఆద్యంతం యువతను ఆకట్టుకునేలా ఈ పాట విశేషంగా ఆదరణ పొందనుందని తరుణ్ భాస్కర్ తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Rangamarthanda Movie: నటులు ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలో దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం 'రంగమార్తాండ'. మరాఠీలో విజయవంతమైన 'నటసామ్రాట్'కు రీమేక్‌గా రూపొందింది. అయితే కొంతకాలం క్రితం.. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్న సమయంలో అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఇప్పుడీ సినిమాకు ఎట్టకేలకు మోక్షం కలిగిందట. మళ్లీ షూటింగ్ ప్రారంభించి మిగిలిన భాగాన్ని త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆగస్టులో థియేటర్లలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ఓటీటీ నుంచి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. కాగా, రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో ఈ మూవీని రూపొందిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆ షార్ట్‌ఫిల్మ్‌కు 513 అవార్డులు.. గిన్నిస్‌లో చోటు