ETV Bharat / entertainment

గతజన్మలో అక్కడే పుట్టానేమో!: సాయిపల్లవి - virataparvam release date

Rana Saipallavi Virataparvam: హీరో రానా, సాయిపల్లవి కలిసి నటించిన చిత్రం 'విరాటపర్వం'. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా తన కెరీర్​ సహా చిత్ర సంగతులను తెలిపారు సాయిపల్లవి. ఆ విశేషాలివీ...

saipallavi virataparvam
సాయిపల్లవి విరాటపర్వం
author img

By

Published : Jun 15, 2022, 6:36 AM IST

Updated : Jun 15, 2022, 6:48 AM IST

Rana Saipallavi Virataparvam: అచ్చ తెలుగుకు లంగావోణి వేస్తే... అది సాయిపల్లవిలా ఉంటుంది అంటారు కొందరు. తెలంగాణలోని అమ్మాయిల గడుసు తనానికి గొంతుకనిస్తే... అది ఆమెలానే మాట్లాడుతుందంటారు ఇంకొందరు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూరి పడచు కొంటెతనాన్ని చిత్రంగా గీస్తే... ఆమెలా కనిపిస్తుందంటారు మరికొందరు. తెలుగు ప్రేక్షకులకి తమ ఇంట్లో అమ్మాయిగా మారిపోయిన సాయిపల్లవి ఏ పాత్ర ఇచ్చినా అందులో సహజంగా ఒదిగిపోతుంది. అందుకే ఆమెని అందరూ అంత వేగంగా సొంతం చేసుకున్నారు. గుర్తుండిపోయే పాత్రలు చేసిన సాయిపల్లవి ఇటీవల 'విరాటపర్వం'లో వెన్నెల పాత్రలో నటించింది. రానా దగ్గుబాటి కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సాయిపల్లవివిలేకర్లతో ముచ్చటించారు. సినిమా సంగతులు తెలిపారు.

మీ పాత్రకి స్ఫూర్తి అయిన సరళ కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నారు కదా. వాళ్లెలా స్పందించారు?
ట్లున్నవు బిడ్డా, ఎక్కడికి పోయినవు, ఎందుకు ఇంటికి రాలేదంటూ వాళ్ల బిడ్డతో మాట్లాడినట్టే నన్ను పలకరించారు. భావోద్వేగాల్ని ఆపుకోలేకపోయా. నేను కుటుంబంలోకి వెళ్లి వచ్చిన అనుభూతి కలిగింది. సారె ఇచ్చి, బొట్టు పెట్టి పంపించారు. సినిమా చూసి సంతోషించారంటే అదింకా తృప్తినిస్తుంది.
ఇది వెన్నెల కథ కదా! ఇందులో రానా దగ్గుబాటి భాగం కావడంపై మీ అభిప్రాయం ఏమిటి?
రానా శరీర తత్వానికీ, తన గళానికీ, తన స్థాయికి తగ్గ కథ ఇది. ఆయన ఇందులో భాగమయ్యాక సినిమా స్థాయి పెరిగింది. మొదట ఈ కథలో రానా చేస్తున్నాడని నాకు తెలియదు. తను ఈ స్క్రిప్ట్‌ చదివి, నచ్చి రవన్న పాత్ర చేయడం కోసం ముందుకొచ్చారు. నందితాదాస్‌, ప్రియమణి, ఈశ్వరీరావు ... వీళ్లందరినీ తెరపై చూసి ఎంతో ఆరాధించాను. వాళ్లతో కలిసి నటిస్తున్నప్పుడు భయపడలేదు కానీ, తెరపై చూసుకున్నాక థ్రిల్‌కి గురయ్యాను. డానీ, దివాకర్‌ మణి కెమెరా పనితనం ఒక కవిత్వంలాగే ఉంటుంది. సురేష్‌ బొబ్బిలి సంగీతం అదే స్థాయిలో అలరిస్తుంది.
సాయిపల్లవి కోసమే రాసిన కథ ఇదని చెబుతుంటారు దర్శకులు. మీకంటూ ఓ ఇమేజ్‌ ఏర్పడింది. దీనిపై మీ అభిప్రాయమేమిటి?
నా కోసమే కథలు రాసుకుంటున్నారంటే అది ఆనందమే కదా. ఇక ఇమేజ్‌ అంటారా? స్టార్‌డమ్‌, ఇమేజ్‌లాంటి ఒత్తిళ్లు పెట్టుకోకుండా నటిస్తున్నా. మంచి కథలు, గౌరవప్రదమైన పాత్రల్లో భాగం కావడంపైనే ఉంటుంది నా దృష్టంతా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తెలంగాణ నేపథ్యంలో ఎక్కువ సినిమాలు చేస్తుండడంతో, మిమ్మల్ని తెలంగాణ ఆడబిడ్డలానే చూస్తున్నారంతా....?
మా దర్శకుడు వేణు అదే అన్నారు. బహుశా గత జన్మలో నేను ఇక్కడే పుట్టానేమో. మా ఇంట్లోవాళ్లు 'ఈమధ్య మా అమ్మాయిలాగా నువ్వు ఉండడం లేదు' అంటున్నారు (నవ్వుతూ). తెలంగాణ ఆడబిడ్డలా మారడంతోనేమో మరీ!
ఈమధ్య ఎక్కువ సినిమాలు చేయడం లేదెందుకు?
కరోనాకి ముందు 'లవ్‌స్టోరి', 'విరాటపర్వం' చేశా. ఆ తర్వాత 'శ్యామ్‌ సింగరాయ్‌' చేశా. విరామం గురించి ఎక్కువగా ఆలోచించను. నేను కళని నమ్ముతాను. కొంచెం ఆలస్యమైనా మంచి సినిమా చేయాలని తపిస్తాను. నాకంటూ ఓ కథ రాసి పెట్టి ఉంటే కచ్చితంగా అది నన్ను వెదుక్కుంటూ వస్తుందనేది నా నమ్మకం.
కొత్తగా కబుర్లు ఏమిటి?
తెలుగులో కొన్ని స్క్రిప్ట్‌లు చదువుతున్నా. శివకార్తికేయన్‌తో తమిళంలో ఒక సినిమాకి సంతకం చేశాను. త్వరలోనే 'గార్గి' విడుదలవుతుంది.

ఈ కథలో ఏ అంశం నచ్చి సినిమా చేశారు?
నిజ జీవిత సంఘటనలతో కూడిన కథే అయినా... జరిగినవన్నీ తెరపై చూపించలేం కదా. దీన్నొక కథలాగే నేను చూశా. ఆ తర్వాత నేనే వెన్నెల అనుకుని ఆ పాత్ర చేశా. వెన్నెలలో ఓ అమాయకత్వం కనిపిస్తుంది. తను ఏం నమ్ముతుందో అందుకోసం గట్టి ప్రయత్నం చేస్తుంది. వేణు ఊడుగుల కథ చెప్పినప్పుడు ఈ కథాలోకమే కొత్తగా అనిపించింది. తన రచనలోనే నిజాయతీ కనిపించింది. ఆ సమయంలో ఉద్యమం, ఆ వాతావరణం ఎలా ఉండేదో నాకు బోధించారు. తెలియని ఓ కథని చేసినప్పుడే కదా నటులకి మజా. మాకు కావల్సింది అలాంటి వైవిధ్యమే. మట్టిలో పుట్టిన ఓ పాత్ర ఎలా ఉంటుందో అలాగే కనిపించేందుకు ప్రయత్నించా. కొన్ని పాత్రల కోసం ఐ లైనర్‌ వేసుకుని వెళ్లి నటిస్తుంటా. ఈ పాత్ర కోసం మొహం కడుక్కుని అలాగే వెళ్లి నటించేదాన్ని.
"కళ శాశ్వతం. అందుకే చేస్తే ఎప్పటికీ నిలిచిపోయే సినిమాలే చేయాలనుకుంటా. నేను వెళ్లిపోయిన తర్వాత నా సినిమాని ప్రేక్షకులు ఆస్వాదించాలి. కళాత్మక, వాణిజ్య ప్రధానమైనవి... ఇలాంటి తేడాల్ని నేను నమ్మను. ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో మనం చెప్పలేం. కానీ చేసినది పది కాలాలు గుర్తుండాలి".

Last Updated : Jun 15, 2022, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.