రానా నాయుడు వెబ్‌సిరీస్‌తో అలరించిన నటుడు దగ్గుబాటి రానా తన సోదరి నిర్వహిస్తున్న ఓ యూట్యూబ్ ఛానల్లో సందడి చేశారు. హీరో విక్టరీ వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి.. ఆశ్రిత ఇన్ఫినిటీ ప్లాటర్ అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్‌ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఇందులో వివిధ రకాల వంటకాలను వ్యూవర్స్‌కు పరిచయం చేసిన ఆమె.. తాజాగా తన అన్నయ్య రానాతో కలిసి ఓ ఎపిసోడ్‌ను చేశారు. దీంట్లో ఆశ్రిత తన సోదరుడితో కలిసి పిజ్జాలు తయారు చేశారు.
స్వీట్ మెమోరీస్ ఉన్నాయి.. ఎపిసోడ్ షూటింగ్లో భాగంగా వీరిద్దరూ కలిసి తమ చిన్నప్పుడు నివాసం ఉన్న ఇంటిని నెటిజన్లకు చూపించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఈ భవనంలో ప్రస్తుతం శాంచరీ పేరుతో తన స్నేహితుడు గోకుల్ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నట్లు రానా తెలిపారు. సోదరి ఆశ్రితతో కలిసి ఈ రెస్టారెంట్లోకి వెళ్లిన ఆయన తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ ఇంట్లో మరిచిపోలేని ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పారు.
భయపడ్డా..కానీ.. సోదరితో కలిసి పిజ్జాలు తయారు చేసిన రానా.. మాంసం, చీజ్ ఎక్కువగా ఉన్న పిజ్జాలను తినడమంటే ఎక్కువ ఇష్టమని చెప్పారు. అదే సమయంలో వెంకటేశ్‌తో కలిసి చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి కూడా మాట్లాడారు. "బాబాయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మొదట్లో కాస్త భయపడ్డాను. ఎందుకంటే ఇలాంటి షోలు, సినిమాలు నేను చేస్తుంటాను. కానీ, బాబాయ్ ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు. మొదట కాస్త కంగారుగా అనిపించినా.. సెట్స్‌లోకి వెళ్లేసరికి ఉత్సాహంగా పాల్గొన్నాము. ఆయనతో కలిసి వర్క్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. కాస్త విభిన్నంగా ఏదైనా చేయాలనుకున్నా. అలాగే, బాబాయ్ కూడా తనని తాను మౌల్డ్ చేసుకున్నారు. ఏదైనా కొత్తగా ట్రై చేయాలని అనుకున్నారు. మేమిద్దరం కలిసి అలాంటి రోల్స్ చేయడం చాలా స్పెషల్‌గా అనిపించింది. సెట్స్‌లో ఆయన నుంచి చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. సిరీస్ చూసిన తర్వాత ఇంట్లో వాళ్ల నుంచి డిఫరెంట్ రియాక్షన్స్ వస్తున్నాయి" అని రానా అన్నారు.
బావ నాగ చైతన్యతో.. అశ్రిత వీడియో..
కొద్ది రోజుల క్రితం హీరో అయిన తన బావ నాగ చైతన్యకు సంబంధించిన ఓ క్లౌడ్ కిచెన్‌ను తన ఛానల్లో చూపించింది అశ్రిత. ఆ వీడియోలో.. ఆశ్రిత అడిగిన కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు నాగ చైతన్య సమాధానమిచ్చారు. అక్కడ తయారయ్యే ఆహారం గురించి వివరించారు. తాను తయారు చేసిన వంటకాన్ని రూచి చూపించారు. ఆ టేస్ట్‌కు ఫిదా అయిన ఆశ్రిత.. చైతూతో పాటు అక్కడి చెఫ్‌లను అభినందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">