ETV Bharat / entertainment

చరణ్​​ సతీమణి ఉపాసనకు కరోనా.. కోలుకున్నా అంటూ పోస్ట్‌ - ఉపాసన కరోనా పాజిటివ్​

Ramcharan wife upasana corona: మెగాహీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తెలిపిన ఆమె.. ప్రస్తుతం తాను కొవిడ్‌ నుంచి కోలుకున్నట్లు పోస్ట్ చేశారు.

upasana corona
రామ్​చరణ్​ సతీమణి ఉపాసనకు కరోనా
author img

By

Published : May 11, 2022, 1:11 PM IST

Ramcharan wife upasana corona: మెగాహీరో రామ్‌చరణ్‌ సతీమణి, వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల ఇటీవల కొవిడ్‌ బారిన పడ్డారు. చెన్నైలో ఉంటోన్న కుటుంబసభ్యులను కలిసేందుకు వెళ్లాలనుకున్న ఆమె కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ బుధవారం ఉదయం ఆమె ఓ పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం తాను కొవిడ్‌ నుంచి కోలుకున్నట్లు తెలిపారు.

"కొవిడ్‌ నుంచి కోలుకున్నా. విశ్రాంతి తీసుకుంటూనే మళ్లీ లైఫ్‌ని అన్నివిధాలుగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యా. గతవారం నేను కొవిడ్‌ బారినపడ్డాను. వ్యాక్సినేషన్‌ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. దాంతో వైద్యులు కేవలం పారాసిటిమాల్‌, విటమిన్‌ మందులు మాత్రమే వాడమని చెప్పారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక. శారీరకంగా, మానసికంగా ఎంతో ధైర్యంగా ఉన్నా. కొవిడ్‌ మళ్లీ విరుచుకుపడుతుందా? అంటే చెప్పలేం. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండటం, సంతోషంగా జీవించడం ఎంతో ముఖ్యం. చెన్నైలో ఉన్న మా తాతయ్యని కలిసేందుకు వెళ్లాలనుకుని పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌గా తేలింది. ఒకవేళ టెస్టులు చేయించుకోకపోతే ఎవరికీ తెలిసేది కాదు" అని ఉపాసన రాసుకొచ్చారు.

ఇదీ చూడండి: చరిత్ర సృష్టించిన హీరోయిన్ ఫొటో.. వేలంలో రూ.1500కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.