ETV Bharat / entertainment

సల్మాన్​-చరణ్-వెంకీ సాంగ్ చూశారా.. స్టెప్పులతో అదరగొట్టేశారుగా! - సల్మాన్​ ఖాన్​ వెంకటేస్​ ఏంటమ్మా సాంగ్​

బాలీవుడ్ భాయ్​ సల్మాన్‌ ఖాన్‌, విక్టరీ వెంకటేశ్‌, మెగా పవర్​స్టార్​ రామ్‌ చరణ్‌ కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఆ సాంగ్ చూశారా?

yentamma song
సల్మాన్​-చరణ్-వెంకీ సాంగ్ చూశారా.. స్టెప్పులతో అదరగొట్టేశారుగా!
author img

By

Published : Apr 4, 2023, 1:46 PM IST

Updated : Apr 4, 2023, 3:59 PM IST

బాలీవుడ్ భాయ్​ సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌'. పూజా హెగ్డే హీరోయిన్​. తాజాగా ఈ సినిమాలోని 'ఏంటమ్మ.. ఏంటమ్మ..' అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్​. ఈ సాంగ్​లో సల్మాన్‌తో పాటు.. విక్టరీ వెంకటేశ్‌, మెగా పవర్​స్టార్​ రామ్‌ చరణ్‌ కూడా అదిరిపోయేలా లుంగీ స్టెప్పులేశారు.

లుంగీ డ్యాన్స్ అంటే ప్రేక్షకులకు 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలోని షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ వేసిన స్టెప్పులే గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడొచ్చిన ఈ సాంగ్​తో ఓ నయా ట్రెండ్​ సెట్​ చేశారు కిసీకా భాయి కిసీకీ జాన్​ టీమ్​. ఇందులోని స్టార్స్​​ వేసిన స్టెప్పుల గురించి ఇప్పుడు నెట్టింటంతా టాక్​. ఇందులో రామ్​ చరణ్​ స్పెషల్​ అప్పీయరెన్స్​ పాటకు హైలైట్​గా నిలిచిందని అభిమానులు సంబరాలు చేసుకంటున్నారు. ప్రముఖ డ్యాన్స్​ కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆ అనుబంధంతోనే...
కండల వీరుడు సల్మాన్ ఖాన్​కు, మెగా ఫ్యామిలీ మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకనే చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాలో సల్మాన్ ఖాన్​ ఓ స్పెషల్​ రోల్​లో మెరిశారు. మరోవైపు హిందీలో రామ్ చరణ్ 'జంజీర్' సినిమా చేసినప్పుడు కూడా సల్మాన్​ మద్దతు ఇచ్చారు. ఇక సల్మాన్​ హైదరాబాద్ వస్తే మెగాస్టార్ ఇంటికి తప్పకుండా వెళ్తారు. ఆ అనుబంధం వల్లనే ఇప్పుడు ఈ సినిమాలోనూ రామ్ చరణ్ ఓ స్పెషల్ రోల్​లో మెరిశారు.

వెంకీ ఐడియాకు సల్లూ భాయ్​ ఓకే..
ఇప్పటికే ఈ సినిమా నుంచి 'బతుకమ్మ' అనే సాంగ్​ను రిలీజ్​ చేసింది చిత్ర బృందం. 'కె.జి.యఫ్' ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. అయితే సినిమాలోని ఓ సందర్భంలో ఈ పాట పెడితే బాగుంటుందని విక్టరీ వెంకటేశ్​ సలహా ఇచ్చారట. ఇక ఆ ఐడియా నచ్చిన సల్మాన్ ఖాన్ వెంటనే ఈ పాట పెట్టమని దర్శక, నిర్మాతలకు సూచనలిచ్చారట. సుమారు 200 మంది డ్యాన్సర్లతో పాటు హీరో హీరోయిన్లు ఈ పాటకు స్టెప్పులేసి అలరించారు. ఇక ఈ పాటలో నటి భూమిక కూడా మెరిశారు.

ఇక సినిమా విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తున్నారు. ఇక పూజహెగ్డేకు అన్నయ్య పాత్రలో టాలీవుడ్​ స్టార్​ హీరో విక్టరీ వెంకటేశ్​ ఓ ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్​తో అదరగొడుతున్న ఈ సినిమా ఏప్రిల్ 21న థియేటర్లలో సందడి చేయనుంది. అటు హిందీతో పాటు ఇటు తెలుగు స్టార్స్​ ఉన్నందున ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Last Updated : Apr 4, 2023, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.