ETV Bharat / entertainment

అమిత్​ షాతో చిరంజీవి, రామ్ ​చరణ్ ప్రత్యేక భేటీ - చిరంజీవి రామ్​చరణ్​ను కలిసిన అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు మెగా పవర్​ స్టార్​ రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించారు.

Ramcharan Chiranjeevi Amithshah Meeting
Ramcharan Chiranjeevi Amithshah Meeting
author img

By

Published : Mar 17, 2023, 10:40 PM IST

Updated : Mar 18, 2023, 6:46 AM IST

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు మెగా పవర్​ స్టార్​ రామ్ చరణ్ భేటీ అయ్యారు. ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత అమెరికా నుంచి నేరుగా దిల్లీకి వచ్చిన చరణ్.. తన తండ్రితో కలిసి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం ఈ ముగ్గురు కలిసి కాసేపు ముచ్చటించారు.

Ramcharan Chiranjeevi Amithshah Meeting
అమిత్​ షాతో చిరంజీవి, రామ్​చరణ్ భేటీ

ఈ సందర్భంగా అమిత్​ షా.. ఆర్ఆర్ఆర్‌ 'నాటు నాటు' సాంగ్​కు 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగంలో ఆస్కార్ దక్కడం పట్ల చరణ్​ను ప్రత్యేకంగా అభినందించారు. ఇంకా సినిమాకు సంబంధించిన విశేషాలను కూడా మాట్లాడుకున్నారు. అయితే ఈ భేటీ అటు సినీ, రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే దిల్లీలో ఇండియా టుడే నిర్వహిస్తున్న రెండు రోజుల కాన్ క్లేవ్ సదస్సుకు రామ్ చరణ్​ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్​లో ప్రధాని మోదీతో చరణ్​ వేదికను పంచుకోనున్నారు. అందులో భాగంగానే చరణ్​, చిరంజీవి.. అమిత్ షాను కలిశారు.

Ramcharan Chiranjeevi Amithshah Meeting
అమిత్​ షాకు పుష్పగుచ్ఛం ఇస్తున్న చరణ్​
Ramcharan Chiranjeevi Amithshah Meeting
రామ్​చరణ్​కు సత్కరిస్తున్న అమిత్​ షా

అంతకుముందు ఆస్కార్​ ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్​ కీరవాణి, కాలభైరవ అండ్ టీమ్ కూడా నేడు(మార్చి 17)న హైదరాబాద్​కు చేరుకున్నారు. జూనియర్​ ఎన్టీఆర్ కూడా ఇప్పటికే అక్కడి నుంచి తిరిగి వచ్చేశారు. వీరందరికీ విమానాశ్రయంలో అభిమానులు గ్రాండ్​గా వెల్కమ్ తెలిపారు. అలానే ఈ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు దక్కడం పట్ల ఆర్​ఆర్​ఆర్​ టీమ్​ మొత్తం హర్షం వ్యక్తం చేశారు. ఇక అమెరికా నుంచి నేరుగా భార్య ఉపాసనతో కలిసి దిల్లీకి వెళ్లిన చరణ్​కు కూడా అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో చరణ్​ మాట్లాడుతూ.. 'నాటు నాటు' తమ ఒక్కరి పాట మాత్రమే కాదని.. ఇది అందరి పాట అని.. దేశ ప్రజలందరూ కలిసే దీన్ని ఆస్కార్‌ వరకు తీసుకెళ్లారని పేర్కొన్నారు.

దమ్కీ ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో తారక్​.. ఇకపోతే ఈ రోజే యంగ్ హీరో విశ్వక్​ సేన్ నటించిన 'దాస్​ కా దమ్కీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్రాండ్​గా జరిగింది. ఈ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్​ హాజరయ్యారు. సినిమా విజయం సాధించాలని ఆశించారు. అలా ఒకే రోజు అటు రామ్​చరణ్​ దిల్లీలో.. తారక్​ 'దమ్కీ' ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో పాల్గొని సందడి చేశారు. కాగా, కొన్ని నెలల క్రితం ఎన్టీఆర్‌ను.. అమిత్ షా హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో కలుసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో వీరిద్దరు కలిసి దాదాపు 20 నిమిషాల పాటు ముచ్చటించుకున్నారు.

ఇదీ చూడండి: విశ్వక్​ను చూసి షాక్​ అయ్యా.. ఆ రోజే రియలైజ్​ అయ్యా: ఎన్టీఆర్​

Last Updated : Mar 18, 2023, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.