ETV Bharat / entertainment

Ramayan 2023 Cast : హిందీ రామాయణంలో సాయి పల్లవి ? సీత క్యారెక్టర్​లో మెప్పించనున్నారా? - రామాయణ్​ 2023లో సాయి పల్లవి

Ramayan 2023 Cast : బాలీవుడ్​లో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్​ 'రామాయణ్'లో సౌత్​ స్టార్ సాయి పల్లవి భాగం కానుంది. సీత క్యారెక్టర్​కు ఆమెను ఫిక్స్​ చేసినట్లు టాక్​ నడుస్తోంది. ఆ విశేషాలు మీ కోసం..

sai pallavi ramayanam 2023
sai pallavi ramayanam 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 8:17 AM IST

Ramayan 2023 Cast : 'ఆదిపురుష్' తర్వాత తెరపైకి ఎక్కనున్న మరో రామాయణం గురించి ఇప్పుడు నెట్టింట టాక్​ నడుస్తోంది. బాలీవుడ్​ దర్శకుడు నితేశ్​ తివారీ ఈ భారీ ప్రాజెక్ట్​ గురించి ప్రకటించినప్పుడు ఇందులో ఎవరెవరు నటించున్నారన్న విషయంపై అందరి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రాముడు, సీత, రావణుడి పాత్రలో ఏయే తారలు కనిపించనున్నారంటూ మూవీ లవర్స్ నెట్టింట డిస్కషన్ కూడా మొదలెట్టారు. ఈ క్రమంలో ​బాలీవుడ్ కపుల్​ ఆలియా భట్​- రణ్​బీర్​ కపూర్​ పేర్లు బాగా వినిపించాయి. అంతే కాకుండా కేజీయెఫ్​ స్టార్​ యశ్​ పేరు కూడా వినిపించింది. దీంతో ఫ్యాన్స్​ అందరూ ఈ కాంబోలో సినిమా పడితే సూపర్​ హిట్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. రాముడిగా రణ్​బీర్​ కపూర్​ను సీతగా ఆలియా భట్​ను రావణుడిగా యశ్​ను ఊహించుకున్నారు కూడా. కానీ తాజా సమాచారం ప్రకారం ఆలియా ఈ ప్రాజెక్టులో ఇప్పుడు భాగం కాదట. ఆమె స్థానంలో ఇప్పుడు సాయి పల్లవిని తీసుకున్నారట. ఈ క్రమంలో ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి ఇంకో రెండు నెలల్లో షూటింగ్ మొదలుపెట్టబోతున్నారట. అయితే ప్రాజెక్ట్​ మొదట్లో సాయి పల్లవి పేరు వినపించినప్పటికీ.. ఆలియా తెరపైకి రావడం వల్ల.. సాయి పల్లవి ఇక ఈ ప్రాజెక్ట్​లో లేనట్లే అని అందరూ భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మళ్లీ సాయి పల్లవి పేరు వినిపించడం పట్లు ఫఅయాన్స్​ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాత్రకు ఆమె న్యాయం చేస్తారని అంటున్నారు.

Yash In Ramayan Movie : మరోవైపు రావణుడిగా హీరో యశ్​ రోల్​ విషయంలోనూ అనేక సందేహాలు మొదలయ్యాయి. మొదట్లో ఆయన పేరు కన్ఫామ్ అయినప్పటికీ.. ఆ తర్వాత ఆయన ఈ సినిమా చేస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే రావణాసురుడిగా నటించేందుకు తాజాగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఫస్ట్ పార్ట్ కోసం పదిహేను రోజులు కాల్ షీట్స్ ఇచ్చారని.. రెండో భాగంలో ఎక్కువ డేట్స్ ఇచ్చేలా అంగీకారం కుదిరిందని టాక్​ నడుస్తోంది. నితీశ్​ తెరకెక్కిస్తున్న రామాయణంలో దశకంఠుడి ఎంట్రీని క్లైమాక్స్​లో చూపించి.. ఆ తర్వాత తెరకెక్కనున్న సీక్వెల్​లో యష్ మీద ఎక్కువ కథ నడిచేలా కథను రాసుకున్నట్టు వినికిడి. దీంతో ఈ విషయం ఓ మేర క్లారిటీ వచ్చింది. కానీ ఈ అప్​డేట్​లపై మూవీ టీమ్​ అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ ఇచ్చేవరకు మనం ఏ విషయంపై అంచనా వేయలేమని ఫ్యాన్స్​ భావిస్తున్నారు.

యశ్​ యూ టర్న్​.. రూ.1500కోట్ల ప్రాజెక్ట్​ లుక్​ టెస్ట్​కు రెడీ!

సిల్వర్​స్క్రీన్​పై మరో రామాయణం.. నటీనటులు వీళ్లేనట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.