Ramaiya Vastavaiya Song : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా నుంచి తాజాగా ఓ సాంగ్ రిలీజై నెట్టింట సందడి చేస్తోంది. అదే 'రామయ్యా వస్తావయ్యా'. ఈ సాంగ్.. విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ పాటలో తన స్టెప్పులతో కింగ్ ఖాన్ అదరగొట్టగా.. లేడీ సూపర్ స్టార్ నయన్ కూడా స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంది. మరో హీరోయిన్ సన్య మల్హోత్రా కూడా ఈ సాంగ్‌లో కనిపించి సందడి చేసింది
Shahrukh Khan Ramaiya Vastavaiya Song : అయితే ఈ పాటలో క్యాచీ లైన్ అయిన 'రామయ్యా వస్తావయ్యా' పై అందరి దృష్టి పడింది. వాస్తవానికి అది ఓ తెలుగు పదం. ఇతర భాషల వారికి ఇది అంతగా తెలియనప్పటికీ.. తెలుగు వాళ్లకు ఈ మాట సుపరిచితమే. అంతే కాకుండా సినిమా టైటిల్స్, సాంగ్స్‌లో ఈ మాటను విరివిగా విన్నాం. అయితే ఈ లైన్‌ను సినీ రంగానికి పరిచయం చేసింది మాత్రం ఓ బాలీవుడ్ వ్యక్తి. ఇంతకీ ఆయన ఎవరంటే..
బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కపూర్. ఆయన లీడ్ రోల్లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ 'శ్రీ 420'. ఈ సినిమాకు శంకర్, జై కిషన్, శైలేంద్ర, హజ్రత్ జైపురితో కూడిన మ్యూజిక్ టీమ్.. అద్భుతమైన సాంగ్స్‌ను అందించారు. అయితే వీరందరూ అప్పుడప్పుడు ఖండాలాకు పర్యటించేవారు. ఇక మార్గ మధ్యలో వారందరూ ఓ మోటల్(రోడ్ సైడ్ హోటల్) వద్ద ఆగి టీ తాగేవారు. అక్కడ వారికి రామయ్య అనే ఓ తెలుగు వెయిటర్ పరిచయమయ్యారు. అయితే మూవీ టీమ్‌లోని శంకర్.. కొంత కాలం హైదరాబాద్‌లో ఉన్నందున ఆయన మాత్రం రామయ్యతో తెలుగులో మాట్లాడేవారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Raj Kapoor Ramaiya Vastavaiya Song : అలా ఎప్పటిలాగే ఓ సారి మోటల్‌కు వెళ్లగా.. శంకర్ ఏదో ఆర్డర్ ఇచ్చేందుకు వెయిటర్ రామయ్యను పిలిచారు. అయితే వెయిటర్ కొంచెం బిజీగా ఉన్నందున ఆయన దగ్గరికి వచ్చేందుకు కాస్త సమయం పట్టింది. దీంతో రామయ్య కోసం వేచి ఉన్న శంకర్.. వెంటనే 'రామయ్యా వస్తావయ్యా' అంటూ హమ్ చేయడం మొదలెట్టారు. ఇక శంకర్ మాటలకు యాదృచ్ఛికంగా జై కిషన్ తబలా ట్యూన్ జోడించారు.
'ఇంకేదైనా కావలా' అంటూ శంకర్‌ను రామయ్య అడగ్గా.. గేయ రచయిత శైలేంద్ర వెంటనే.. 'మైనే దిల్ తుఝకో దియా' అని అన్నారు. ఇక అంతే 'రామయ్యా వస్తవయ్యా' సాంగ్ రెడీ అయిపోయింది. మ్యూజిక్ టీమ్ ఈ సాంగ్‌ను రాజ్ కపూర్‌కు వినిపించగా.. అది ఆయనకు తెగ నచ్చిందట. దీంతో వెంటనే ఆ పాటకు తుది మెరుగులు దిద్ది సినిమాలో పెట్టారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు 'రామయ్యా వస్తావయ్యా' అనే ఈ లైన్ తెగ పాపులరైంది. అలా 1955లో మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్న ఈ 'రామయ్యా వస్తావయ్యా'ను.. ఆ తర్వాత 2013లో నటుడు ప్రభుదేవ మరోసారి ప్రేక్షకులను పరిచయం చేశారు. తెలుగులో సూపర్ హిట్ అయిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాను హిందీలో 'రామయ్యా వస్తావయ్య'గా రీమేక్ చేశారు. ఇప్పుడు మళ్లీ దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ కొత్త సాంగ్ వల్ల 'రామయ్యా వస్తావయ్యా' మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
-
ఇది చయ్యా చయ్యా కాదు. ఇది #NotRamaiyaVastavaiya. ఇది జవాన్ థా థా థైయా.
— Shah Rukh Khan (@iamsrk) August 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Idhi chaiya chaiiya Kadhu. Idhi #NotRamaiyavastavaiya. Idhi Jawan that tha thaiya.
Full Song out now!
Thx @anirudhofficial, @Sreeram_singer, @RakshitaaSuresh, @chandrabose4321, @VMVMVMVMVM#Jawan… pic.twitter.com/6VQ6zY3wkS
">ఇది చయ్యా చయ్యా కాదు. ఇది #NotRamaiyaVastavaiya. ఇది జవాన్ థా థా థైయా.
— Shah Rukh Khan (@iamsrk) August 29, 2023
Idhi chaiya chaiiya Kadhu. Idhi #NotRamaiyavastavaiya. Idhi Jawan that tha thaiya.
Full Song out now!
Thx @anirudhofficial, @Sreeram_singer, @RakshitaaSuresh, @chandrabose4321, @VMVMVMVMVM#Jawan… pic.twitter.com/6VQ6zY3wkSఇది చయ్యా చయ్యా కాదు. ఇది #NotRamaiyaVastavaiya. ఇది జవాన్ థా థా థైయా.
— Shah Rukh Khan (@iamsrk) August 29, 2023
Idhi chaiya chaiiya Kadhu. Idhi #NotRamaiyavastavaiya. Idhi Jawan that tha thaiya.
Full Song out now!
Thx @anirudhofficial, @Sreeram_singer, @RakshitaaSuresh, @chandrabose4321, @VMVMVMVMVM#Jawan… pic.twitter.com/6VQ6zY3wkS
Jawan Trailer Announcement : బుర్జ్ ఖలీఫాపై జవాన్ ట్రైలర్.. రిలీజ్ డేట్ ఫిక్స్
Jawan VS Salaar : అడ్వాన్స్ బుకింగ్స్.. జవాన్-సలార్ సరికొత్త రికార్డ్స్!