ETV Bharat / entertainment

ప్రభాస్​ మూవీలో రామ్​గోపాల్​ వర్మ!.. క్యారెక్టర్​ ఎలా ఉంటుందో? - రామ్​గోపాల్​ వర్మ మూవీస్​

Ram Gopal Varma Prabhas: కాంట్రవర్సీలకు కేరాఫ్​ అడ్రెస్​గా నిలిచే టాలీవుడ్​ దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ.. త్వరలో ఓ పాన్‌ ఇండియా సినిమాలో నటించనున్నారట. రెబల్​ స్టార్​ ప్రభాస్​తో స్క్రీన్​ షేర్​ చేసుకోనున్నారట. ఆ వివరాలు..

rgv in prabhas k2 movie
rgv in prabhas k2 movie
author img

By

Published : Nov 12, 2022, 8:10 PM IST

Ram Gopal Varma Prabhas: సెన్సేషనల్​ డైరెక్టర్​ రామ్​గోపాల్​ వర్మ తాను తెరకెక్కించిన సినిమాలతోనే కాదు వాటి ప్రమోషన్ల వల్ల సినీ ఇండస్ట్రీలో చాలా ఫేమస్​ అయ్యారు. కాంట్రవర్సీలకు కేరాఫ్​ అడ్రెస్​గా నిలిచే ఈ డైరెక్టర్.. అప్పటి 'శివ'నుంచి ఇప్పటి 'కొండా' వరకు తనదైన మార్క్​ను​ సృష్టించారు. అయితే త్వరలో ఓ ప్రముఖ స్టార్​తో స్కీన్​ షేర్​ చేసుకోనున్నారని సమాచారం. ఆయన మరెవరో కాదు మన ఆరడుగుల అందగాడు ప్రభాస్​.

వరుస పాన్‌ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్​.. ప్రస్తుతం 'సలార్‌', 'ప్రాజెక్ట్‌-కె' సినిమాల్లో నటిస్తున్నారు. మైథలాజికల్​ మూవీ 'ఆది పురుష్‌' నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుండగా.. మారుతీతో మరో ప్రాజెక్ట్‌ను ఆయన లైన్లో పెట్టారు. అయితే 'ప్రాజెక్ట్-​కె'కు సంబంధించిన ఓ అప్డేట్​ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో రామ్​గోపాల్​ వర్మ మెరవనున్నారట. దీని కోసం ఇటీవలే నాగ్ అశ్విన్.. ఆర్జీవీని సంప్రదించగా కథ నచ్చడం వల్ల ఆయన వెంటనే ఓకే చెప్పేశారట. దీంతో ఆర్జీవీ త్వరలో రంగులు అద్దుకునేందుకు సిద్ధం కానున్నారని సమాచారం.

దీంతో ఆర్జీవీ రోల్ గురించి ఫ్యాన్స్​లో ఆసక్తి నెలకొంది. ఎప్పుడు డిఫరెంట్​గా ఆలోచించే ఆర్జీవీ అసలు ఎటువంటి క్యారెక్టర్​లో తెరపై కనిపించనున్నారని ఆలోచిస్తున్నారు. అయితే ఈ వార్తలో వాస్తవమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. . వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీ దత్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొణె నటిస్తున్నారు.

ఇదీ చదవండి:'కాంతార' ఓటీటీ సంగతేంటి? అప్పటివరకు వచ్చే ఛాన్స్​ లేదా?

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిపాస బసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.