ETV Bharat / entertainment

ఉపాసన డెలివరీ జరిగేది అక్కడే.. ఆ రూమర్​కు చెక్​! - ఉపాసన డెలివరీ జరిగేది అక్కడే

రామ్​చరణ్​ భార్య ఉపాసన.. తన ఫస్ట్​ డెలివరీపై జరుగుతున్న ప్రచారానికి చెక్​ పెట్టారు. తన డెలివరీ ఎక్కడ జరుగుతుందో, డాక్టర్లు ఎవరో కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..

Ram Charan Upasana Konidela clear rumours  announce first baby to be born in India
ఉపాసన డెలివరీ జరిగేది అక్కడే.
author img

By

Published : Feb 28, 2023, 5:46 PM IST

Updated : Feb 28, 2023, 6:17 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన కామినేని కొణిదెల త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే. అయితే ఉపాసన డెలివరీ ఎక్కడ జరుగుతుంది? స్వదేశంలోనా లేదా విదేశాల్లోనా అనే ఆలోచన చాలా మంది అభిమానుల మదిలో మెదులుతోంది. ఇటీవల ఓ అమెరికన్ టీవీ టాక్​ షోలో రామ్ చరణ్ సందడి చేయగా.. అక్కడ జరిగిన సంభాషణ ఆధారంగా అమెరికాలో ఉపాసన డెలివరీకి ప్లాన్ చేస్తునట్లు చాలా మంది సోషల్​మీడియాలో ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు అది నిజం కాదని తెలిసింది. తాజాగా ఉపాసనే స్వయంగా సోషల్​మీడియా వేదికగా డాక్టర్లు, డెలీవరి వివరాలను తెలిపింది. భారత్​లోనే డెలివరీ చేయించుకుంటానని, అది కూడా అపోలో హాస్పిటల్‌లోనే జరుగుతుందని ఉపసాన చెప్పుకొచ్చింది. డాక్టర్స్​ సుమన మనోహర్, రూమా సిన్హాలు ఆపరేషన్ చేస్తారని తెలిపింది. డా.జెన్నిఫర్ ఆస్టన్​ను.. 'మీరు కూడా రావొచ్చుగా' అంటూ మరో అంతర్జాతీయ డాక్టర్‌కు ఉపాసన విజ్ఞప్తి చేసింది. దీంతో ఆ డాక్టర్ కూడా తాను వస్తానని చెప్పుకొచ్చింది.

ఇదీ జరిగింది... ఇకపోతే రీసెంట్​గా 'గుడ్ మార్నింగ్ అమెరికా' టాక్​ షోలో చరణ్​ పాల్గొని.. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాటు తన పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడారు. త్వరలోనే ఆయన తండ్రి కాబోతున్న ప్రస్తావన కూడా అక్కడ వచ్చింది. అయితే ఈ షోకు.. అమెరికాలోని ప్రముఖ గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ హోస్ట్​గా వ్యవహరించారు. అప్పుడు చరణ్​.. ఆమెను కలవడం సంతోషంగా ఉందని చెబుతూ.. ఆమె ఫోన్ నంబర్ తీసుకుంటానని చెప్పారు. తన భార్య ఉపాసన అమెరికా వస్తుందని.. డెలివరీకి ఆస్టన్​ అందుబాటులో ఉంటే బాగుంటుందని అన్నారు. అందుకు జెన్నిఫర్ కూడా ఒకే చెప్పారు. 'మీతో జర్నీ చేయడానికి నేను రెడీ. మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడం నాకు గౌరవం' అంటూ ఆమె బదులిచ్చారు.

అయితే దీనిపై తాజాగా ఉపాసన.. జెన్నిఫర్ ఆస్టన్ టూ స్వీట్ అంటూ ట్వీట్ చేశారు. త్వరలో ఆమెను కలవాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. భారత్​లోనే అపోలో ఆస్పత్రిలో డాక్టర్లు సుమనా మనోహర్, రూమా సిన్హాతో కలిసి డెలివరీ చేయమని ఆమెకు విజ్ఞప్తి చేశారు. అందుకు జెన్నిఫర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇక రామ్​చరణ్ సినిమాల విషయానికొస్తే.. గతేడాది 'ఆర్​ఆర్​ఆర్'​తో బిగ్గెస్ట్ బ్లాక్​బస్టర్​ను అందుకున్న ఆయన.. ప్రస్తుతం దర్శకుడు శంకర్​తో 'ఆర్ ​సీ 15' సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్​తో రూపొందుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇదీ చూడండి: వినోదయ సీతమ్​.. పవన్​-సాయితేజ్​తో పాటు ఇంకెవరు నటిస్తున్నారంటే?

Last Updated : Feb 28, 2023, 6:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.