మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'చిరంజీవి మౌనంగా, సౌమ్యంగా ఉంటారని అందరికీ తెలుసు. ఆయన మౌనం వీడితే భరించలేరు. నాన్న మౌనంగా ఉంటారేమే కానీ.. మేం కాదు. ఆయనను ఏమైనా అంటే మేం ఊరుకోమని చెబుతున్నా. ఆయనను అనాలంటే కుటుంబ సభ్యులైనా.. అభిమానులైనా అయ్యుండాలి" అని రామ్‌చరణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మెగా ఫ్యామిలీ విషయంలో కొంతమంది రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రామ్‌చరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అది ఆషామాషీ విషయం కాదు : చిరంజీవి
సక్సెస్ మీట్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. తాను వరంగల్‌కు వచ్చి చాలా కాలమైందని.. అక్కడ రోడ్‌షో చేసినప్పటి దృశ్యాలు ఇంకా తన కళ్లలో కదలాడుతూనే ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. "అదే స్థాయిలో ఉన్న ఈ జనసందోహాన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది. వరంగల్‌లోనే విజయోత్సవ వేడుక నిర్వహించాలని ప్రతి ఒక్కరం అనుకున్నాం. ఈ సినిమా విజయం సాధిస్తుందనుకున్నాంకానీ.. నాన్ 'బాహుబలి', నాన్ 'ఆర్‌ఆర్‌ఆర్' స్థాయి చిత్రం అవుతుందని ఊహించలేదు. ఈ విజయంలో అగ్రతాంబూలం అందుకోవాల్సిన వారు ప్రేక్షకులు. ఈ సినిమా నేటితో రూ. 250 కోట్ల (గ్రాస్) వసూళ్ల మార్క్ చేరుకోబోతోందంటే అది ఆషామాషీ విషయంకాదు'' అని చిరంజీవి అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజ రవితేజ కలిసి నటించిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుు ముందుకు వచ్చి విశేషంగా అలరించింది. దీంతో ఈ సినిమా సక్సెస్ మీట్ హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
ఇవీ చదవండి : తారకరత్న ఆరోగ్యంపై మెగా హీరో ఎమోషనల్ పోస్ట్.. అన్న త్వరగా కోలుకోవాలంటూ..