ETV Bharat / entertainment

Ram Charan Paris Tour : పారిస్​లో చెర్రీ- ఉప్సీ సందడి.. ఫొటోలు చూశారా ?

Ram Charan Paris Tour : గ్లోబల్​ స్టార్ రామ్​చరణ్ ప్రస్తుతం పారిస్​ నగరంలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తన సతీమణితో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆ ఫొటోలను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి..

Ram Charan Paris Tour
Ram Charan Paris Tour
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 7:34 AM IST

Updated : Sep 13, 2023, 10:49 AM IST

Ram Charan Paris Tour : తన సతీమణి ఉపాసనతో పారిస్ వెళ్లిన గ్లోబల్ స్టార్​ రామ్ చరణ్​.. తాజాగా అక్కడ జరిగిన ఓ సన్నిహితుల వివాహానికి హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఉపాసన ఇన్​స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలో నూతన వధూవరులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. "ప్రియమైన రోజ్మిన్.. నీకు శుభాకాంక్షలు.. పారిస్​లో మీతో మేము మరింత సరదాగా గడిపాము" అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

చూడముచ్చటగా ఉన్న ఆ ఫొటోల్లో చెర్రీ అవుట్​ఫిట్​ అందరి దృష్టిని ఆకర్షించింది. లేత గోధుమ రంగు వర్ణంలో ఉన్న ఆ సూట్​లో చెర్రీ ఎంతో బాగున్నారంటూ అభిమానులు సోషల్​ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు రామ్‌చరణ్‌ - ఉపాసన దంపతులు రీసెంట్​గా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇటీవలే ఆ చిన్నారికి క్లీంకార అని నామకరణం చేశారు.

Ram Charan Movies : ప్రస్తుతం చెర్రీ.. స్టార్ డైరెక్టర్ శంకర్​తో 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్​ చరణ్​ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్​గా నటిస్తోంది. అంజ‌లి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, న‌వీన్ చంద్ర‌, సునీల్, జ‌య‌రాయ్‌ తదితరులు ఈ సినిమాలో కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

RC16 Movie : మరోవైపు చెర్రీ- బుచ్చిబాబు సినిమా తెరపైకి ఎక్కేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఉప్పెన సినిమాతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన బుచ్చిబాబు రెండో సినిమాతోనే బంప‌ర్ ​ఆఫ‌ర్‌ను అందుకున్నారు. ప‌వ‌ర్‌ఫుల్ స‌బ్జెక్ట్‌తో పాన్ ఇండియ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు మేకర్స్​ తెలిపారు. అంతే కాకుండా అప్పట్లో ఈ సినిమా ఓ స్పోర్ట్స్​ సినిమాగా కూడా తెరకెక్కనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ చిత్రంలో రామ్​చరణ్​ హ్యాండీక్యాప్డ్​గా కనిపించనున్నారట. ఈ సినిమాలో విలన్​ క్యారెక్టర్​లో తమిళ స్టార్ యాక్టర్​ విజయ్​ సేతుపతిని ప్రతినాయకుడిగా తీసుకున్నారట. బాలీవుడ్​ భామ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటించనుందట. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్​ సంగీతం అందించనున్నట్లు తెలిసింది.

Chiranjeevi Birthday : ''చిరు'తాత.. హ్యాపీ బర్త్​డే'.. క్లీంకార​ స్పెషల్​ విషెస్​.. క్యూట్​ ఫొటో చూశారా?

Ram Charan Dhruva 2 : ధృవ సీక్వెల్ తమిళ్ స్క్రిప్ట్ రెడీ.. త్వరలోనే షూటింగ్.. తెలుగులో కూడా!

Last Updated : Sep 13, 2023, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.