ETV Bharat / entertainment

అతిపెద్ద స్క్రీన్​పై RRR ప్రదర్శన.. అమెరికా వెళ్లనున్న మూవీ టీమ్ - అమెరికా స్పెషల్​ స్క్రీనింగ్​కు వెళ్లనున్న ​చరణ్

ఆర్ఆర్ఆర్ సినిమా మరో ఘనత సాధించింది. అమెరికాలోని ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్​పై ఈ చిత్రం మెరవనుంది. ఈ స్పెషల్ స్క్రీనింగ్​లో మూవీ టీమ్​ సందడి చేయనుంది.

rrr spacial screening usa
rrr spacial screening usa
author img

By

Published : Jan 2, 2023, 11:51 AM IST

దిగ్గజ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్​లో రామ్‌చరణ్‌- తారక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన విజువల్‌ వండర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌కి పెద్ద పీట వేశారు. దీంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆ తర్వాత ఓటీటీలో కూడా అదే జోరు కొనసాగించింది. ఈ సినిమా పలు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డులు కూడా గెలుచుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అమెరికాలో ఇప్పటివరకు చాలా స్పెషల్​ స్క్రీనింగ్స్​ కూడా వేశారు.

తాజాగా, లాస్​ ఏంజెలిస్​లో ఉన్న టీఎల్​సీ చైనీస్​ థియేటర్​లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్​ స్క్రీన్​లో ఆర్​ఆర్​ఆర్​ సినిమా ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శన జనవరి 9న జరగనుంది. కాగా, ఈ స్పెషల్​ స్క్రీనింగ్​లో దర్శక ధీరుడు రాజమౌళి, రామ్​చరణ్, ఎన్టీఆర్​తో పాటు సంగీత దర్శకుడు కీరవాణి కూడా పాల్గొననున్నారు. ప్రేక్షకులతో ఇంటరాక్ట్​ కానున్నారు. కాగా, ఇప్పటివరకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఆర్ఆర్​ఆర్​.. ఆస్కార్​ రేసులో కూడా నిలిచింది. ఉత్తమ పాట కేటగిరీలో చిత్రంలోని 'నాటు నాటు' పాట షార్ట్​ లిస్ట్​ అయింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.