ETV Bharat / entertainment

రామ్​చరణ్​కు అరుదైన గౌరవం- పాప్ గోల్డెన్ అవార్డ్స్​లో విజేతగా స్టార్ హీరో - రామ్​చరణ్​ను కలిసిన నెట్​ఫ్లిక్స్ సీఈవో

Ram Charan Golden Bollywood Actor Award : 2023 పాప్ గోల్డెన్ అవార్డ్స్​లో స్టార్ హీరో రామ్​చరణ్, గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్​గా నిలిచారు. ఈ మేరకు అవార్డు నిర్వాహకులు అవార్డు విజేతను వెల్లడించారు.

Golden Bollywood Actor Award
Golden Bollywood Actor Award
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 7:42 PM IST

Updated : Dec 9, 2023, 8:30 PM IST

Ram Charan Golden Bollywood Actor Award : 2023 పాప్ గోల్డెన్ అవార్డ్స్​లో స్టార్ హీరో రామ్​చరణ్, గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీలో విజేతగా నిలిచారు. ఈ మేరకు అవార్డు నిర్వాహకులు విజేతను అనౌన్స్​ చేశారు. ఈ కేటగిరీ నామినేషన్స్​లో రామ్​చరణ్​తో పాటు బాలీవుడ్ బాద్ షా షారుక్​ ఖాన్, దీపికా పదుకొణె, రాశీ ఖన్నా, ఆదా శర్మ, రిద్ధి దోగ్రా ఉండగా, వీరందరినీ వెనక్కినెట్టి మెగా పవర్​స్టార్ విజేతగా ఎంపికయ్యారు.

పాప్ గోల్డెన్ అవార్డ్స్​ ఇంటర్నేషనల్ స్థాయిలో అందిస్తారు. ప్రతి ఏటా ఈ అవార్డ్స్​ అమెరికాలో నిర్వహిస్తారు. అయితే భారత్​లోని బాలీవుడ్ యాక్టర్లకు కూడా ఈ అవార్డ్స్​ ఇచ్చి ప్రోత్సహిస్తుంటారు నిర్వహకులు. ఈ క్రమంలో 2023 సంవత్సరానికిగాను రామ్​చరణ్​ను అవార్డు వరించింది. ఇక ఆర్​ఆర్​ఆర్ సినిమాతో మెగా పవర్​స్టార్ గ్లోబల్ స్టార్​గా మారిపోయిన సంగతి తెలిసిందే.

Netflix CEO Meets Ram Charan : ఇదిలా ఉండగా, ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ సంస్థ నెట్​ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్‌, రెండు రోజులుగా హైదరాబాద్​ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన, గురువారం రామ్​చరణ్​ నివాసాన్ని సందర్శించారు. సీఈవో టెడ్, మెగాస్టార్ చిరంజీవి సహా సాయిధరమ్ ​తేజ్, వైష్ణవ్ తేజ్​, రామ్​చరణ్​తో కాసేపు ముచ్చటించారు. ఈ మీట్​కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

Ram Charan Game Changer : గ్లోబల్ స్టార్ రామ్​చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్, భారీ బడ్జెట్​తో పాన్​ ఇండియా లెవెల్​లో తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​పై ప్రముఖ నిర్మాత దిల్​రాజు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ, చెర్రీకి జంటగా నటిస్తోంది. ఇక పలు కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్న కారణంగా, మెగా ఫ్యాన్స్ కాస్త నిరాశ పడుతున్నారు. ఈ సినిమా నుంచి ఎప్పడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

రామ్​చరణ్​ మూవీలో బిగ్​బాస్​ కంటెస్టెంట్​ కీలక పాత్ర- అనౌన్స్​ చేసిన డైరెక్టర్!

వాయిదా పడ్డ గేమ్​ ఛేంజర్ సాంగ్​ - ఫ్యాన్స్​కు మళ్లీ నిరాశే!

Last Updated : Dec 9, 2023, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.