Rajnikanth 169th Movie: ఏ విషయంలోనైనా సూపర్‌స్టార్ రజనీకాంత్ స్టైలే వేరు. తాజాగా తన 169వ సినిమాపై వస్తున్న రూమర్స్‌పై తలైవా స్పందించారు. విజయ్ 'బీస్ట్' సినిమా విడుదలకు ముందే సూపర్‌స్టార్ రజనీకాంత్ 169వ చిత్రం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతుందని చిత్రబృందం తెలియజేసింది. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియోను కూడా విడుదల చేసింది. అయితే బీస్ట్ సినిమాకు మిశ్రమ స్పందనలు రావడం వల్ల.. రజనీ తన తదుపరి ప్రాజెక్టు విషయంలో నిర్ణయాన్ని మార్చుకున్నారంటూ రూమర్స్ వచ్చాయి. తలైవా 169వ చిత్రం వేరే దర్శకుడితో చేయనున్నారని నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగింది. ఈ ఊహాగానాలకు రజని తనదైన శైలిలో చెక్ పెట్టారు.
ట్విట్వర్లో తన ఖాతాకు నెల్సన్‌తో రానున్న సినిమా వీడియోలోని ఫొటోనే కవర్ పేజీగా పెట్టారు. దీంతో తన నిర్ణయం మారలేదని అభిమానులకు సందేశమిచ్చినట్లైంది. కాగా.. నెల్సన్ ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ సిద్ధంచేసే పనిలో ఉన్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం. వినోదాత్మక చిత్రంగా తెరకెక్కనున్న తలైవా 169వ చిత్రంలో రజనీ న్యూలుక్‌లో కనిపించనున్నారు.
RRR Dosti Full Video Song: జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం బాక్సాఫీసు వద్ద ఎన్నో రికార్డులు సృష్టించింది. కీరవాణి స్వరపరిచిన బాణీలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని రామ్ చరణ్- తారక్ మధ్య సాగే దోస్తీ పాటకు ఫిదా అయ్యారు అభిమానులు. సినిమా విడుదల తర్వాత పూర్తి వీడియో సాంగ్ ఎప్పుడొస్తుందో అని ఎదురుచూస్తున్నారు. అయితే.. తాజాగా ఈ పాట పూర్తి వీడియో సాంగ్‌ను గురువారం(ఏప్రిల్ 21)న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇదివరకే ఈ సినిమా నుంచి ఎత్తర జెండా, కొమ్మ ఉయ్యాల పూర్తి వీడియో సాంగ్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
-
Witness the friendship of Ramaraju🔥& Bheem 🌊#Dosti #Natpu #Priyam
— BA Raju's Team (@baraju_SuperHit) April 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Full Video Song Releasing Tomorrow at 4PM.
An @MMKeeravaani Musical!@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @LahariMusic @TSeries @RRRMovie #RRRMovie pic.twitter.com/JNY0hoq9xf
">Witness the friendship of Ramaraju🔥& Bheem 🌊#Dosti #Natpu #Priyam
— BA Raju's Team (@baraju_SuperHit) April 20, 2022
Full Video Song Releasing Tomorrow at 4PM.
An @MMKeeravaani Musical!@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @LahariMusic @TSeries @RRRMovie #RRRMovie pic.twitter.com/JNY0hoq9xfWitness the friendship of Ramaraju🔥& Bheem 🌊#Dosti #Natpu #Priyam
— BA Raju's Team (@baraju_SuperHit) April 20, 2022
Full Video Song Releasing Tomorrow at 4PM.
An @MMKeeravaani Musical!@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @LahariMusic @TSeries @RRRMovie #RRRMovie pic.twitter.com/JNY0hoq9xf
Samantha Kaathuvaakula Rendu Kaadal New Song: వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ సమంత దూసుకుపోతున్నారు. తాజాగా సామ్.. హీరో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటించిన చిత్రం 'కాత్తు వాక్కుల రెండు కాదల్'. ఈ సినిమాకి నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకుడు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. అయితే ఈ చిత్రం నుంచి 'డిప్పం డప్పం' లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. కాగా, ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: 'నాన్నతో కలిసి నేను సినిమా చేయాలన్నది అమ్మ కల'
అదిరిన 'అర్జున కల్యాణం' ట్రైలర్.. రామ్- శింబు 'స్నీక్ పీక్' రిలీజ్