ETV Bharat / entertainment

రాజమౌళి చెప్పడం వల్లే ఎన్టీఆర్​తో అలా చేశా.. లేదంటే: రాజీవ్ కనకాల - రాజీవ్​ కనకాల సినిమాలు

విలక్షణ పాత్రలతోనే కాదు.. నటనతో ఎంతో ఆకట్టుకునే నటుడు రాజీవ్‌ కనకాల. విద్యార్థిగా, యువ నాయకునిగా ఎన్నో పాత్రలను పోషించారు. చూడగానే సొంతింటి మనిషి అన్నట్టుగా ఉండే రాజీవ్‌ దాదాపుగా 150 చిత్రాల్లో నటించారు. ఇప్పటికే మూడు దశాబ్దాల నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న రాజీవ్‌ కనకాల ఈటీవీ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. తన నటన, పాత్రల తీరు, పరిశ్రమతో అనుబంధాన్ని వెల్లడించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 8, 2022, 3:02 PM IST

విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న నటుడు రాజీవ్‌ కనకాల. విద్యార్థిగా, యువ నాయకునిగా ఎన్నో పాత్రలను కూడా పోషించారు. ఇప్పటివరకు దాదాపుగా 150 చిత్రాల్లో నటించిన ఆయన.. తాజాగా ఈటీవీ 'చెప్పాలని ఉంది' ఇంటర్వ్యూలో తన నటన, పాత్రల తీరు, పరిశ్రమతో ఉన్న అనుబంధాన్ని వెల్లడించారు. ఆ విశేషాలివీ..

గత 30 ఏళ్లలో 150 చిత్రాల్లో నటించారు. మంచి పేరు తెచ్చిపెట్టిన వాటి గురించి చెబుతారా..?
రాజీవ్‌ కనకాల: బాపూగారి 'రాంబంటు' బాగా పేరుతెచ్చింది. అంతకుముందు 'సూర్యపుత్రులు' చేసినా ముందు మాత్రం ‘రాంబంటు’ విడుదలైంది. అక్కడి నుంచి సినీ జీవితం మొదలయ్యింది.
పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన తొలితరం నటులు దేవదాస్‌ కనకాల. ఆయన శిక్షణలో చాలా మంది నటులు వచ్చారు. ఇదంతా చూస్తుంటే ఏం అనిపిస్తుంది..?
రాజీవ్‌ కనకాల: దేవదాస్‌ కనకాలే కాదు.. లక్ష్మీదేవి కనకాల గురించి కూడా తెలుసుకోవాలి. నాన్న గురించి అందరికీ తెలుసు. ముందు అమ్మ గురించి చెబుతా. నైజాం ప్రభుత్వం కంటే ముందే ప్రొద్దుటూరు నుంచి వలస వచ్చారు. ఏరువాక సాగారో చిన్నన్నా.. లాంటి పాటలకు నృత్యాలు, నాటిక, నాటకాలను కూడా స్టేజీ మీద వేశారు. నాన్న ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమో చేస్తున్నపుడు నాటకాలు వేసేవారు. 1968లో పుణె వెళ్లారు. అక్కడ అన్ని భాషల వారున్నారు. హిందీ రాకపోయినా గ్రంథాలయంలో నేర్చుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ కలుసుకొన్నారు. ఇక్కడ ఎంతో మంది నటనలో శిక్షణ ఇచ్చారు. వాళ్ల తర్వాత ఇనిస్టిట్యూట్‌ను నేను కొనసాగించలేదు. ఎందుకంటే బాధ్యత తీసుకుంటే మిగతావన్నీ వదిలేయాలి. పాఠాలు చెప్పా. బిజీగా ఉండటంతో అందులో పని చేయడానికి వీలు కాలేదు.

Rajeev kanakala about NTR Rajamouli
తండ్రితో

దేవదాస్‌ కనకాల చాలా సీరియల్స్‌కు దర్శకత్వం వహించారు. అందులో మీరు నటించిన సీరియల్‌ ఉందా..?
రాజీవ్‌ కనకాల: ఆయన దర్శకత్వంలోనే ‘ఏ గూటి చిలక..ఆ గూటి పలుకు’, ‘డ్యామిట్‌ కథ అడ్డం తిరిగింది’, ‘రాజశేఖర చరిత్ర’ చేశా. అయితే అన్నింటికన్నా ముందు ‘అనగనగా శోభ’లో చిన్న పాత్ర వేశా. రాజశేఖర చరిత్రలో కుటుంబసభ్యులందరం నటించాం. నవలను నాటికగా చేశారు.
హీరో లక్షణాలన్నీ ఉన్నాయి..అయినా హీరో కింద ఉండే పాత్రల్లో నటించారు. ఎందుకు?
రాజీవ్‌ కనకాల: ‘స్టూడెంట్‌ నం.1’ తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేశా.. ‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’లో ఓ పాత్ర అని చేశా. దానికి మంచి పేరు వచ్చింది. వీటన్నింటికన్నా ముందు ‘బాయ్‌ఫ్రెండ్‌’తో వెండితెరకు పరిచయం అయ్యా. నన్నే ఎంపిక చేశారనుకున్నా. తీరా షూటింగ్‌లో 700 మంది పాల్గొన్నారు. రెండు, మూడు రోజుల తర్వాత మనతో కాదని వచ్చేశా.

సుమతో చూపులు కలిసిన శుభవేళ ఎప్పుడు?
రాజీవ్‌ కనకాల: దూరదర్శన్‌కు ఒక షూట్‌ చేసి వెళ్లినప్పుడు అక్కడ మీర్‌ గారిని చూసి వద్దామనుకున్నా. అక్కడే సుమను చూశా. ‘బాగానే ఉంది కదా’ అనుకున్నా. జీకే మోహన్‌తో సెంట్రల్‌ యూనివర్సిటీలో షూటింగ్‌ ఒక్కరోజే అదీ సుమతోనే ఉంది. ఒక్కరోజులో ఎలా పడేయాలి..? రెండ్రోజులుంటే బాగుండు అనుకున్నా. రెండు రోజులు షూటింగ్‌ జరిగినా ఏమీ కాలేదు. ‘తెలుగువారి పెళ్లి’కి మీర్‌ దర్శకత్వంలో తెలుగు పాటలు చేస్తున్నారు. అందులో నేను పెళ్లి కొడుకు.. పెళ్లికూతురు వేరే అమ్మాయి.. తర్వాత సుమను పెట్టారు. ఐదారు రోజులు పెళ్లితంతు జరిగింది. అక్కడేం చెప్పలేదు. కానీ, నాన్నచేసిన ‘మేఘమాల’లో హీరోయిన్‌ సుమ, శ్రీధర్‌ హీరో, నేను, అనితాచౌదరి మరో జంట. ఆ తర్వాత మా మధ్య స్నేహం పెరిగి, ప్రేమగా మారింది. ఎట్టకేలకు 1999లో సుమతో పెళ్లి అయ్యింది.
రాజమౌళితో స్టూడెంట్‌ నం.1 మీ కెరీర్‌లో పెద్ద మలుపు తీసుకొచ్చింది. అందులో అవకాశం ఎలా వచ్చింది?
రాజీవ్‌ కనకాల: రాఘవేంద్రరావుగారి ‘శాంతి నివాసం’ సెట్‌లో ఉంటే రాజమౌళి వచ్చి ‘ఇక్కడ టెలివిజన్‌ ఇండస్ట్రీ ఏమీ తెలియదు. నీ మద్దతు కావాలి’ అని అడిగారు. సీరియల్‌ షూటింగ్‌ రోజున ఉదయం ఆరు గంటలకే ఫోన్‌ చేశారు. కేవలం మూడు పేజీల డైలాగ్‌లు గంటలో అయిపోతుందనుకున్నా. కానీ, రాత్రి ఒంటిగంట వరకు సాగించారు. అప్పుడే జక్కన్నగా మారిపోయాడు. అక్కడే స్టూడెంట్‌ నం.1 అవకాశం వచ్చింది. విలన్‌ పాత్రకు కొత్తవారు కావాలనుకున్నారు. కానీ, రాజమౌళి మాత్రం నన్నే కావాలన్నారు. వేతనం తక్కువగా ఇస్తానంటే ఒప్పుకోలేదు. రాజమౌళినే ఒప్పించారు. అలా ఎన్టీఆర్‌, జక్కన్నతో స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది.

Rajeev kanakala about NTR Rajamouli
సుమతో

ఎన్టీఆర్‌ మిమ్మల్ని చూసి ‘చాలా బాగా చేశావ్‌’ అని మెచ్చుకున్న సందర్భాలున్నాయా..?
రాజీవ్‌ కనకాల: బోలెడన్ని సందర్భాలున్నాయి. కాకపోతే ఎప్పుడూ ఆ మాట చెప్పుకోలేదు. నటన విషయంలో ఇద్దరం పోటీపడి చేసినట్టు అనుకునేవాళ్లం. ఇక ఇంట్లో వాళ్లు నా నటన గురించి ఏదైనా నేరుగా అనేస్తారు. ‘లవ్‌స్టోరీ’కి కాస్త ఇబ్బంది పడ్డా. విలన్‌ అయితే ఓకే. బాబాయ్‌ పాత్ర అనే సరికి ఇబ్బంది పడ్డా. శేఖర్‌ కమ్ముల బాబాయ్‌గానే ఒప్పించారు.
కుటుంబంలో అమ్మ, నాన్న, చెల్లెలు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు కదా..?
రాజీవ్‌ కనకాల: బాధే కదండీ! తలుచుకుంటే బాధ తన్నుకొస్తుంది. నాన్న అనుకోకుండా చనిపోయారు. చెల్లెలు మరణం ఊహించలేదు. ఆరోగ్యపరంగా ఎలాంటి అనుమానం ఉన్న జాగ్రత్తపడాలి. క్యాన్సర్‌ను పరిశీలించుకోండి. ముఖ్యంగా మహిళలు చాలా జాగ్రత్త పడాలి.

సుమ మద్దతు ఎలా ఉంటుంది...?
రాజీవ్‌ కనకాల: తన మద్దతు లేకపోతే ఎలా..? నేను షూటింగ్‌లకు వెళ్తే జాగ్రత్తగా చూసుకుంటారు. తన సహకారం బాగుంటుంది.
మీ తర్వాత కుమారుడిని పరిచయం చేస్తానన్నారు..?
రాజీవ్‌ కనకాల: కొత్త నిర్మాత, దర్శకులు ఆలోచన చేస్తున్నారు. నా దాకా ఇంకా వాళ్లు రాలేదు. వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతం అబ్బాయి బీకాం అయిపోయింది. అమ్మాయి ఇంటర్‌. తను యాంకర్‌గా చేస్తుందేమో..!

మీకు ఆత్మాభిమానం ఎక్కువట కదా! అందుకే అవకాశాలను అందుకోలేకపోయారని విన్నాం..?
రాజీవ్‌ కనకాల: నాకు సినిమాలు కావాలని ఎవరినీ అడగలేదు. ఎవరైనా వస్తే చేస్తా. నా పరిధిలోనే చేస్తా. పాత్రకు న్యాయం చేస్తారంటే ఇస్తారు.
దర్శకత్వం చేసే ఆలోచన ఉందా..?
రాజీవ్‌ కనకాల: ఉంది. సినిమా ఎలా చేయాలో తెలుసు. అన్ని రంగాలపై దృష్టి పెట్టా. నాకు చాలా విషయాలు తెలుసు. నేను చేసినప్పుడు ఎవరూ ఇబ్బంది పడొద్దు.

దేవదాస్‌ కనకాల దగ్గర రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌ లాంటి వాళ్లు శిక్షణ తీసుకున్నారు. వాళ్లతో మీ అనుబంధం ఎలా ఉంది..?
రాజీవ్‌ కనకాల: అప్పటికి నాకు ఊహ లేదు. వాళ్లతో ఎలాంటి అనుబంధం లేదు. ‘ఫిల్మ్‌ బై అరవింద్‌ చూపించవా’ అని చిరంజీవి అడిగారు. ఓరోజు ప్రసాద్‌ ల్యాబ్‌లో వేస్తే కుటుంబమంతా వచ్చి చూశారు.
ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు..?
రాజీవ్‌ కనకాల: శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ‘ఆర్‌సీ15’ చేస్తున్నా. బాలకృష్ణ, సాయిధరమ్‌తేజ్‌, కీరవాణి అబ్బాయి సినిమాతో పాటు చాలా ఉన్నాయి.
ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఎలా ఉండాలి..?
రాజీవ్‌ కనకాల: మీ పాత్ర మీరు చేయాలి. ఎవరికిచ్చే గౌరవం వాళ్లకు ఇవ్వాలి. లౌక్యం కూడా ఉండాలి.

Rajeev kanakala about NTR Rajamouli
ఎన్టీఆర్​తో

ఇదీ చూడండి: ఎన్టీఆర్​, కల్యాణ్​రామ్​ ఘనత.. వీరి చిత్రాలతోనే ఆ స్టార్​ డైరెక్టర్ల కెరీర్​ షురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.