ETV Bharat / entertainment

ఆస్కార్స్ నామినేషన్స్‌లో జక్కన్న.. 72 శాతం ఫిక్స్​! - ఆర్​ఆర్​ఆర్​ రామ్​ చరణ్

దర్శక ధీరుడు రాజమౌళికి ఆస్కార్ వచ్చే ఆస్కారం ఉందా? అవార్డు సంగతి పక్కన పెడితే.. నామినేషన్ లభిస్తుందా? ఆయనకు నామినేషన్ వచ్చే అవకాశం ఎంత ఉంది? అంటే..

rajamoulis RRR oscar nominationt
rajamoulis RRR oscar nomination
author img

By

Published : Dec 3, 2022, 8:37 PM IST

Oscar For Rajamouli : ''రాజమౌళికి ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను. ఆ పురస్కారానికి ఆయన అర్హుడు'' - శుక్రవారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఓ ప్రోగ్రామ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పిన మాట. యంగ్ టైగర్ ఎన్టీఆర్​తో కలిసి ఆయన నటించిన 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ బరిలో ఉండటంపై ఈ విధంగా స్పందించారు.

ఆస్కార్... ఆస్కార్... ఆస్కార్... ప్రపంచ సినిమాలో చాలా మంది అత్యున్నత పురస్కారంగా భావించే అవార్డు. ఒక్కసారైనా ఆస్కార్ అందుకోవాలని ఆశించే కళాకారులు, సాంకేతిక నిపుణులు ఎంతో మంది ఉన్నారు. మరి, రాజమౌళికి ఆ ఆస్కార్ వచ్చే ఆస్కారం ఉందా? అవార్డు సంగతి పక్కన పెడితే... నామినేషన్ లభిస్తుందా? ఆయనకు నామినేషన్ వచ్చే అవకాశం ఎంత ఉంది? అంటే.. 72 శాతం అని చెబుతున్నారు నిపుణులు.

న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ మెచ్చిన రాజమౌళి..
ఆస్కార్ కంటే ముందు విదేశాల్లో పేరున్న ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు 'ఆర్ఆర్ఆర్'ను పంపిస్తున్నారు. రాజమౌళి తీసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చూసి విదేశీయులు ఫిదా అవుతున్నారు. అవార్డులు ఇస్తున్నారు. ప్రతి ఏడాదీ (1935 నుంచి) న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు ఇస్తోంది. ఈ ఏడాది 'ఆర్ఆర్ఆర్'కు గాను ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి అవార్డు ఇచ్చారు. దాంతో ఆస్కార్‌కు రాజమౌళి నామినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు చెప్పే మాట.

ఇవీ చదవండి : 'హనుమాన్‌' అదిరిపోయే VFX హాలీవుడ్​ వాళ్లది కాదు.​. చేసింది మనోళ్లే..

చిరు- విజయ్​-బాలయ్య సినిమాలు.. ఈ ఐదు కామన్ పాయింట్లు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.