ETV Bharat / entertainment

Rajamouli New Announcement : భారీ ప్రకటన చేయనున్న జక్కన్న.. మహేశ్ సినిమా గురించైతే కాదు.. ఇంతకీ అదేంటంటే? - Rajamouli New Announcement on indian cinema

Rajamouli New Announcement : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి భారీ ప్రకటన చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే, ఇది తాను డైరెక్ట్ చేయనున్న మహేస్ సినిమా గురించి కాదు. ఇంతకీ అదేంటంటే?

Rajamouli New Announcement : భారీ ప్రకటన చేయనున్న జక్కన్న.. మహేశ్ సినిమా గురించి కాదు.. ఇంతకీ అదేంటంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 6:46 AM IST

Updated : Sep 19, 2023, 9:15 AM IST

Rajamouli New Announcement : 'బాహుబలి' సిరీస్​, 'ఆర్​ఆర్​ఆర్' చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన సినిమా కోసం వరల్డ్ వైడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేశ్​ బాబుతో ఓ భారీ పాన్ వరల్డ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్స్ రాలేదు. అయితే ఇప్పుడు జక్కన్న ఓ భారీ అనౌన్స్​ చేయబోతున్నారని తెలిసింది. అది మహేశ్ సినిమా గురించి కాదు.

Rajamouli New Movie On Indian Cinema : అదేంటంటే.. జక్కన్న నిర్మాతగా మారి ఓ కొత్త సినిమాను ప్రకటించనున్నారట. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇండియన్ సినిమా బర్త్​ అండ్ రైజ్​(భారతీయ సినిమా పుట్టుక, ఎదుగుదల) కాన్సెప్ట్​లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని అంటున్నారు.

ఈ చిత్రంలో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్ యాక్టర్స్​ ఉంటారని, అలాగే చిత్ర నిర్మాణంలో మరికొందరు ప్రొడ్యూసర్లు భాగమవుతారని తెలిసింది. భారీ బడ్జెట్​తో చిత్రాన్ని రూపొందిస్తారట. ప్రస్తుతం ప్రొడక్షన్ బృందాన్ని సిద్ధం చేసుకుంటున్నారట. త్వరలోనే అనౌన్స్​ మెంట్​ రాబోతుందని సినీ విశ్లేషకుడు మనోబాలా విజయబాలన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ఈ చిత్రానికి ఎవరు డైరెక్ట్​ చేస్తారో, ఎవరో నటిస్తారో , ఎప్పుడు అనౌన్స్​మెంట్​ చేస్తారో చూడాలి మరి..

Mahesh Rajamouli Movie : ఇక మహేశ్ బాబు - రాజమౌళి సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ చిత్రం SSMB 29 వర్కింగ్ టైటిల్​తో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్​ను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్‌.. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు ఆ మధ్య జక్కన్న తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్​ చెప్పారు. సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథ సాగనుందట. మహేశ్ ఈ చిత్రంలో సరికొత్త లుక్​లో కనిపించనున్నారట.

  • #SSrajamouli is currently assembling a production team for a new movie about the birth and rise of Indian🇮🇳 Cinema.

    The new biopic about Indian Cinema is not yet titled.

    Rajamouli promise it’s a “magnum opus telling” which will be told “on a huge scale and canvas.

    Announcement… pic.twitter.com/JY7L4IaGyE

    — Manobala Vijayabalan (@ManobalaV) September 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Mahesh Rajamouli Movie : జక్కన్న-మహేశ్​ మూవీ అదిరిపోయే అప్డేట్​ వచ్చిందోచ్​.. సినిమాలో ఆ హాలీవుడ్​ యాక్టర్స్​!

సినిమాల్లోకి జూనియర్​ ఎన్టీఆర్ పెద్ద కొడుకు.. సితార పాపతో కలిసి.. నిజమేనా?

Last Updated : Sep 19, 2023, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.