ETV Bharat / entertainment

నాటు నాటు పాటకు రాజమౌళి స్టెప్పులు అదుర్స్​ - ఆర్​ఆర్​ఆర్​ సక్సెక్​ మీట్​

ఆర్​ఆర్​ఆర్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిస్తున్న సందర్భంగా.. చిత్ర యూనిట్​కు స్టార్​ ప్రొడ్యూసర్​, డిస్ట్రిబ్యూటర్​ దిల్​ రాజు పార్టీ ఇచ్చారు. అయితే ఆ విందులో దర్శకధీరుడు రాజమౌళి నాటు.. నాటు.. పాటకు స్టెప్పులు వేసి అదుర్స్​ అనిపించారు.

దిల్​రాజు పార్టీలో.. రాజమౌళి నాటు.. నాటు.. స్టెప్పులు అదుర్స్​
Rajamouli danced to the song Natu .. Natu .. at Dil Raju Party
author img

By

Published : Apr 4, 2022, 10:56 PM IST

జూనియర్​ ఎన్టీఆర్​, రామ్​చరణ్​ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్​ఆర్​ఆర్ చిత్రం బాక్సాఫీస్​ వద్ద దూసుకోపోతోంది. దీంతో స్టార్​ ప్రొడ్యూసర్​, డిస్ట్రిబ్యూటర్​ దిల్​ రాజు ఆర్​ఆర్​ఆర్​ టీమ్​కు సక్సెస్​ పార్టీ ఇచ్చారు. ఈ విందుకు కొరటాల శివ, అనిల్​ రావిపుడి, ఎన్టీఆర్​, చరణ్​, రాజమౌళి, కీరవాణితోపాటు టాలీవుడ్​ నుంచి దర్శకులు, నిర్మాతలు, నటులు హాజరయ్యారు. పార్టీలో అనిల్​ రావిపూడి సందడి చేశారు. రాజమౌళితో నాటు.. నాటు పాటకు స్టెప్పులు వేయించారు.

ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్​లో భాగంగా జూనియర్​ ఎన్టీఆర్​, రామ్​చరణ్​, రాజమౌళిని అనిల్​ రావిపూడి ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో సినిమా సక్సెస్​ మీట్​లో నాటు.. నాటు.. పాటకు స్టెప్పులు వేసి ప్రేక్షకులకు థ్యాంక్స్​ చెబుతానని రాజమౌళి చెప్పారు. ఆ మాట ప్రకారం.. ఈ పార్టీలో రాజమౌళితో నాటు.. నాటు పాటకు స్టెప్పులు వేయించారు అనిల్​. దీంతో పార్టీలో అంతా ఉత్సాహంగా చప్పుట్లు కొట్టారు. నైజాం ఏరియాలో ఆర్​ఆర్​ఆర్​ సినిమాను దిల్​ రాజు డిస్ట్రిబ్యూట్​ చేశారు. ఈ ప్రాంతంలో సినిమా కలెక్షన్లు సరికొత్త రికార్డు సృష్టించి దూసుకుపోతున్నాయి. ఆ ఆనందంలో దిల్​రాజు ఆర్​ఆర్​ఆర్​ టీమ్​కు పార్టీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.