Raghavendra rao and rajamouli : దర్శకధీరుడు రాజమౌళి గురించి ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు చిత్ర సీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి పెంచడంతో పాటు తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నారు. టాలీవుడ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. అయితే జక్కన్న డైరెక్షన్లో నటించాలని ప్రతి నటుడూ ఆశిస్తారు. అవకాశమొస్తే కథ కూడా వినకుండా ఓకే చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. మరి అంతటి గొప్ప దర్శకుడైన రాజమౌళి.. దర్శకత్వ పాఠాలు నేర్చుకుంది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర. దీంతో కెరీర్ ప్రారంభంలో జక్కన్నకు ఓ మంచి అవకాశం దక్కింది. ఏంటంటే.. తన గురువైన రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడిని డైరెక్ట్ చేసే ఛాన్స్. కానీ అది ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల మిస్సైంది.
ఎలా అంటే.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'స్టూడెంట్ నెం.1' చిత్రాన్ని తన తొలి సినిమాగా చేశారు రాజమౌళి. ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్‌ను అందుకుంది. దీంతో రాజమౌళి దర్శకత్వంలో ప్రకాశ్ కోవెలమూడి హీరోగా ఓ సినిమా చేయాలని గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగాయట. ఈ చిత్రానికి 'విజయ సింహ' అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. అదితి అగర్వాల్‌ను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. దాదాపు నాలుగు నెలల పాటు.. స్క్రిప్ట్ వర్క్ కూడా చేశారు. కానీ ఏమైందో తెలీదు కానీ ఆ సినిమా ఆగిపోయింది. చిత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో సినిమా మధ్యలో ఆగిపోవడంతో.. ప్రకాశ్ మరో డైరెక్టర్ చేతిపై నుంచి లాంఛ్ అయ్యారు. జాన్ మహేంద్రన్ దర్శకత్వంలో 'నీతో' చిత్రం ద్వారా హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో దర్శకుడు రాజమౌళి 'సింహాద్రి' అనే చిత్రం తెరకెక్కించి మరో బ్లాక్బాస్టర్ హిట్‌ను అందుకున్నారు.
మళ్లీ కలిసి పనిచేయలేదు.. ఆ తర్వాత మళ్లీ రాజమౌళి- ప్రకాశ్ వేర్వేరు కలిసి పని చేసే అవకాశం కూడా రాలేదు. ఇద్దరు వేరు వేరు దారుల్లో తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లారు. అయితే నటుడిగా కెరీర్ ప్రారంభించిన ప్రకాశ్.. కొంతకాలానికి డైరెక్టర్‌గా మారారు. 'బొమ్మలాట', 'అనగనగా ఓ ధీరుడు', 'సైజ్ జీరో' సహా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2019లో బాలీవుడ్ భామ కంగనా రనౌత్‌తో కలిసి 'జడ్జిమెంటల్ హై క్యా' అనే చిత్రాన్ని తీశారు.
ఇదీ చూడండి :