Pushpa 2 The Rule Update : 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రష్మిక మందన్నా కథానాయిక. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ ఐకాన్ స్టార్ పుష్ప-2తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
అయితే తొలి భాగంలో మంగళం శ్రీను(సునీల్), ద్రాక్షాయణి(అనసూయ), జాలీ రెడ్డి(కన్నడ నటుడు ధనుంజయ), టాస్క్‌ఫోర్స్ అధికారి గోవిందప్ప(శత్రు).. ఇలా పలు పాత్రలు బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ పాత్రలతో పాటు సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్(మలయాళ స్టార్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్)ను ఎవరు మర్చిపోలేరు. ద్వితీయార్ధం ఆఖరులో ఆయన పాత్ర పరిచయమైంది. ఎవడైనా సరే తనను 'సర్' అనాలి అంటూ పోలీసు పాత్రలో వచ్చి మెప్పించారు. కనిపించింది కాసేపే అయినా.. క్లైమాక్స్ మొత్తం ఆయన మీదే నడవడంతో ఈ క్యారెక్టర్ బాగా పండింది. ఆయన.. మొదట పుష్పను బెదరించడం, ఆ తర్వాత లంచం తీసుకుని పుష్పతో స్నేహం చేయడం.. చివరికి పుష్ప చేతిలోనే ఘోర అవమానాన్ని ఎదుర్కోవడం చూపించారు. అయితే ఇప్పుడు రెండో భాగంలోనూ ఆయన పాత్ర కొనసాగనుంది. తొలి భాగంలో పుష్పరాజ్ నుంచి ఎదురైన అవమానానికి భన్వర్‌సింగ్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడన్న దాన్ని.. పార్ట్-2లో చూపించనున్నారు. అది ఒంటరిగానా.. లేదా మంగళం శ్రీను, ద్రాక్షాయణిలతో కలిశా? అన్నది ఆసక్తికరం. ఈ రెండో భాగంలో షెకావత్ క్యారెక్టర్ ఎక్కువ లెంగ్త్ ఉంటుందని సమాచారం.
అయితే తాజాగా షెకావత్ సర్ గురించి.. మూవీటీమ్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నట్లు తెలిపింది. షెకావత్ పాత్రలో నటించిన ఫహాద్ ఫాజిల్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు పేర్కొంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ఫొటోను షేర్ చేసింది. దీన్ని చూస్తుంటే.. 'పుష్ప: ది రూల్'లో భన్వర్ సింగ్ పాత్ర ప్రేక్షకులను మరింత మెప్పించేలా కనిపిస్తోంది. ఇకపోతే ఇటీవలే 'వేర్ ఈజ్ పుష్ప' అంటూ మూడు నిమిషాల నిడివి గల వీడియో గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇది చూడగానే.. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
కాగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. పార్ట్ -1 పాటలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇప్పుడు ఈ పుష్ప దిరూల్ పాటలు ఎలా ఉంటాయో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రష్మిక హీరోయిన్గా నటిస్తోంది.
-
A key schedule of #Pushpa2TheRule completed with 'Bhanwar Singh Shekhawat' aka #FahadhFaasil 💥💥
— Pushpa (@PushpaMovie) May 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
This time he will return with vengeance ❤️🔥🔥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @SukumarWritings @MythriOfficial @TSeries pic.twitter.com/xDOa82Ctc4
">A key schedule of #Pushpa2TheRule completed with 'Bhanwar Singh Shekhawat' aka #FahadhFaasil 💥💥
— Pushpa (@PushpaMovie) May 18, 2023
This time he will return with vengeance ❤️🔥🔥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @SukumarWritings @MythriOfficial @TSeries pic.twitter.com/xDOa82Ctc4A key schedule of #Pushpa2TheRule completed with 'Bhanwar Singh Shekhawat' aka #FahadhFaasil 💥💥
— Pushpa (@PushpaMovie) May 18, 2023
This time he will return with vengeance ❤️🔥🔥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @SukumarWritings @MythriOfficial @TSeries pic.twitter.com/xDOa82Ctc4