హీరోయిన్‌గా మారిన 'పుష్ప' మూవీ సింగర్ - పుష్ప సింగర్ హీరోయిన్‌గా
పుష్ప సినిమాలోని సామీ సామీ సింగర్ హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుంది. ఆమె నటించిన సినిమా త్వరలోనే రిలీజ్‌కు సిద్ధమైంది. ఆ వివరాలు..

డైరెక్టర్ సుకుమార్-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన 'పుష్ప' మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాలోని పాటలు కూడా అన్ని భాష్లలో ఇండియా వైడ్‌గా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. సోషల్ మీడియాలో ఈ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇక తెలుగులో ఈ పాటను మౌనిక యాదవ్ పాడగా.. తమిళంలో రాజ్యలక్ష్మీ పాడి ఆకట్టుకున్నారు. ఈ పాటతో పాటు ఆమె కూడా అక్కడ బాగా ఫేమస్ అయ్యారు.
అయితే ఇప్పుడు రాజ్యలక్ష్మీ.. నటిగా మారారు. అలాగే నటనకు వయసుతో సంబంధం లేదని రుజువు చేశారు. 32 ఏళ్ల వయసులో ఏకంగా హీరోయిన్‌గా ఛాన్స్ అందుకున్నారు. బుల్లితెరపై సూపర్ సింగర్స్ షో ద్వారా పాపులర్ అయి చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె.. సింగర్‌గా కెరీర్ కొనసాగిస్తున్నారు. అలా ఇప్పుడు నటిగా మారి.. ప్రధాన పాత్రలో 'లైసెన్స్' అనే చిత్రంలో నటించారు. త్వరలో ఈ చిత్రం థియేట్లలోకి రానుంది. ఈ సందర్భంగా చెన్నెలో ఆడియో రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అక్కడ రాజ్యలక్ష్మి.. తనకు నటిగా ఛాన్స్ రావడంపై ఎమోషనల్ అయ్యారు.
రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. "30 ఏళ్ల వయసులో ఇద్దరి పిల్లలకు తల్లి అయిన నేను.. హీరోయిన్‌గా నటిస్తానని అస్సలు ఊహించలేదు. ఈ మూవీ డైరెక్టర్ కాల్ చేసి లైసెన్స్ చిత్రం గురించి కథ చెప్పారు. మొత్తం కథ విన్న తర్వాత ఈ సినిమాలో నేను ఏం చేయాలి అని అడిగాను. మీరే హీరోయిన్ అని చెప్పారు. అప్పుడు నేను నటించగలనా అని అనిపించింది. కానీ ఆ తర్వాత ఒకే చెప్పేశాను. ఈ సినిమాలో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది." అని అన్నారు. కాగా, ఈ చిత్రానికి జేఆర్జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్.జీవానందం నిర్మించారు. గణపతి బాలమురుగన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజ్యలక్ష్మితో పాటు నటుడు రాధారవి, విజయ్ భారత్, ఎన్.జీవానందం, గీత కైలాసం, పళ.కరుప్పయ్య, అభి నక్షత్ర ఇతర పాత్రలు పోషించారు.
ఇకపోతే పుష్ప 2 సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను డిసెంబరులో రిలీజ్ చేయడానికి మూవీటీమ్ సన్నాహాలు చేస్తుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి:
Pushpa 2 Update : 'పుష్ప-2' రిలీజ్ మరింత ఆలస్యం!.. కారణం అదేనా?