ETV Bharat / entertainment

పుష్ప- 2 షూటింగ్​ మరింత ఆలస్యం..​ కారణం అదేనా? - రష్మిక

Pushpa 2 Shoot Delay: అల్లుఅర్జున్​ 'పుష్ప 2' సినిమా షూటింగ్​ ఇంకా మొదలవ్వడానికి చాలా సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది.​ దర్శకుడు సుకుమార్​.. ఈ సినిమా కోసం మరోసారి స్క్రిప్టులో మెరుగులు దిద్దుతున్నారట. మార్పులు చేపట్టే విషయంపై కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

PUSHPA 2 SHOOT DELAY
PUSHPA 2 SHOOT DELAY
author img

By

Published : Apr 23, 2022, 3:46 PM IST

Pushpa 2 Shoot Delay: 'పుష్ప‌'.. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాపీస్​ను ఓ రేంజ్​లో షేక్ చేసింది. తెలుగు, మ‌ల‌యాళం, హిందీతోపాటు మిగిలిన భాష‌ల్లో మంచి టాక్‌తో పాటు క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. ముఖ్యంగా బన్నీ మాస్​గెటప్​, నటన, దేవీ శ్రీ ప్రసాద్​ మ్యూజిక్​​ సినిమాకే హైలైట్​గా నిలిచాయి. స్టార్​ హీరోయిన్​ సమంత చిందులేసిన 'ఊ అంటావా మావ' స్పెషల్​ సాంగ్​ దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. క‌న్న‌డ భామ ర‌ష్మిక ఈ చిత్రంలో శ్రీవ‌ల్లిగా డీ గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టించి.. ఓ రేంజ్​లో పాపులారిటీ సంపాదించుకుంది. ఇక, 'పుష్ప 2' షూటింగ్ కూడా త్వ‌ర‌లోనే షురూ కానున్న‌ట్టు వార్త‌లు ఇప్ప‌టికే వ‌చ్చాయి.

తాజాగా 'పుష్ప 2' షూటింగ్​కు సంబంధించి మ‌రో వార్త నెట్టింట హ‌ల్​చ‌ల్ చేస్తోంది. లెక్క‌ల మాస్టారు సుకుమార్.. యూఎస్ నుంచి నెల రోజుల త‌ర్వాత హైద‌రాబాద్‌కు తిరిగా రానున్నారట. పుష్ప 2ను మొద‌లుపెట్టేందుకు మ‌రో 3-4 నెల‌లు టైమ్​ తీసుకోవాల‌ని అనుకుంటున్నారట‌. ఇది అధికారిక ప్రకటన కాకున్నా.. ఇంత‌కీ ఇలా సడెన్​గా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని సినీప్రియులు అప్పుడే తెగ చ‌ర్చించ‌ుకుంటున్నారు. 'కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 2' సినిమా చూసిన త‌ర్వాతే సుకుమార్ త‌న మైండ్ సెట్​ను మార్చుకున్నారని టాక్ వినిపిస్తోంది.

'పుష్ప'కు సీక్వెల్‌గా రాబోతున్న 'పుష్ప ది రూల్‌'.. భారీ స్థాయిలో, రిచ్‌గా చూపించాల‌ని ఫిక్స్ అయ్యారట ఈ స్టార్ డైరెక్ట‌ర్. అందువ‌ల్ల న‌టీన‌టుల డేట్స్ స‌ర్దుబాటు విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేసిన‌ట్టు వార్త‌లు వస్తున్నాయి. ఇక లేటెస్ట్ అప్డేట్‌ నిజమైతే మాత్రం ర‌ష్మిక‌కు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ భామ ఇప్ప‌టికే హీరో విజ‌య్ 66వ సినిమాలో న‌టిస్తోంది. మ‌రోవైపు, బాలీవుడ్ స్టార్ ర‌ణ్​బీర్ క‌పూర్ 'యానిమ‌ల్' చిత్రం కూడా చేస్తోంది. అయితే ఇప్పుడు పుష్ప సినిమా ఆల‌స్యమ‌వుతుండ‌టం వల్ల త‌న ఫోకస్ మిగిలిన రెండు ప్రాజెక్టుల‌పై పెట్టేందుకు స‌మయం దొరికిన‌ట్ట‌వుతుంది. మరోవైపు, హీరో అల్లుఅర్జున్​ కూడా మరో సినిమా షూటింగ్​లో పాల్గొనబోతున్నారని టాక్​ వినిపిస్తోంది.

ఇవీ చదవండి: 12 ఏళ్లు చిన్నవాడితో డేటింగ్‌.. తప్పేముంది: మలైకా అరోరా

సర్కారు వారి 'టైటిల్' పాట వచ్చేసింది.. మోత మోగిపోయింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.