pushpa 2 shooting update : లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప' మొదటి భాగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2021 డిసెంబర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అల్లు అర్జున్‌తో పాటు ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, అజయ్ ఘోష్.. పాత్రలన్నీ సినిమాలో హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. అక్కడి బాక్సాఫీస్ ముందు ఏకంగా రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అల్లుఅర్జున్‌కు పాన్ ఇండియా స్టేటస్‌ను అందించింది.
దీంతో తెలుగు ఆడియెన్స్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రియులు పుష్ప రెండో భాగం కోసం అప్పటి నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్స్ రావట్లేదు. చాలా ఆలస్యంగా ఎప్పుడో ఒకటి వస్తోంది. ఆ మధ్యలో పుష్ప 2 గ్లింప్స్.. సినిమాపై అంచనాలను మరింత స్థాయికి తీసుకెళ్లిపోయాయి. అయితే వాస్తవానికి ఈ సినిమా మొదటి భాగాన్ని చాలా త్వరగానే ముగించారు. కానీ ఇప్పుడీ రెండో భాగంలో మాత్రం అలా అస్సలు అవ్వట్లేదు. కథ కోసం ఏడాదికి పైగా సమయాన్ని తీసుకున్నారు సుక్కు. ఈ చిత్రాన్ని ఎంతో శ్రద్ధగా తెరకెక్కిస్తున్నారు. ఎక్కడా రాజీపడకుండా ప్రతి చిన్న సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా తీస్తున్నారట. దీంతో ఇప్పుడు రెండో భాగం ఈ ఏడాది కూడా వచ్చే అవకాశం లేదని తెలిసింది. మొన్నటివరకు ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబరులో వస్తుందని అంతా అన్నారు.
pushpa 2 release date : కానీ ఇప్పుడది వాయిదా పడ్డట్లు తెలిసింది. 2024లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. అది కూడా అంతా అనుకున్నట్లు జరిగితే.. 2024 వేసవి చివర్లో పుష్ప 2 అభిమానుల ముందుకు వస్తుందట. లేదంటే దసరాకే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే మొత్తానికి 2024లో మధ్యలో ఈ పుష్ప 2 రావడం పక్కా అని తెలిసింది. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు.. సుక్కు మరో జక్కన్నలా తయారయ్యాడే అని కామెంట్లు చేస్తున్నారు.
ఇదీ చూడండి :
అల్లు అర్జున్ లీక్స్.. 'పుష్ప 2' డైలాగ్ చెప్పేసిన బన్నీ..