ETV Bharat / entertainment

'గాడ్​ఫాదర్​'లో పూరి.. కన్ఫామ్​​ చేసిన చిరు - గాడ్​ఫాదర్​లో చిరు

Purijagannadh in Godfather movie: తన సినిమాలో దర్శకుడు పూరి జగన్నాథ్​ నటించబోతున్నారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్ చిరింజీవి. 'గాడ్​ఫాదర్'​ సినిమాలో పూరి నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిరు.

chiru puri
చిరు పూరి
author img

By

Published : Apr 9, 2022, 11:43 AM IST

Purijagannadh in Godfather movie: సినీప్రియుల ఊహాగానాలు నిజమయ్యాయి. అనుకున్నట్టే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో దర్శకుడు పూరి జగన్నాథ్​ నటించనున్నారు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిరు. " నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేశాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.. అందుకే గాడ్​ఫాదర్​ మూవీలో స్పెషల్​ రోల్​ చేస్తున్న పూరి జగన్నాథ్​ను పరిచయం చేస్తున్నా." అని ట్వీట్​ చేశారు చిరు. మలయాళ హిట్ 'లూసిఫర్'కు రీమేక్​గా 'గాడ్​ఫాదర్'​గా రూపొందుతోంది. మాతృకలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రను తెలుగులో బాలీవుడ్​ సూపర్​ స్టార్​ సల్మాన్‌ ఖాన్​ చేస్తుండటం విశేషం. లేడీ సూపర్​స్టార్ నయనతార హీరోయిన్​. సత్యదేవ్, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

  • నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే
    introducing my @purijagan in a special role,from the sets of #Godfather pic.twitter.com/8NuNuoY33j

    — Chiranjeevi Konidela (@KChiruTweets) April 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: హీరోయిన్​ బాత్రూమ్​లో దూరిన ఫ్యాన్.. పెళ్లి చేసుకోవాలంటూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.