ETV Bharat / entertainment

'కార్మికులకు వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సిద్ధం' - undefined

సినీ కార్మికుల సమ్మె, వేతనాలు పెంపుపై నిర్మాతల మండలి స్పందించింది. కార్మికులకు వేతనాలు పెంచడానికి తమకెలాంటి ఇబ్బంది లేదని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌ స్పష్టం చేశారు.

Producers Council responds to wage hike and Strike
'కార్మికులకు వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సిద్ధం'
author img

By

Published : Jun 22, 2022, 3:19 PM IST

Updated : Jun 22, 2022, 9:24 PM IST

వేతనాలు పెంపు, విధి విధానాల్లో మార్పులు కోరుతూ తెలుగు సినీ కార్మికులు చేపట్టిన సమ్మెపై నిర్మాతల మండలి స్పందించింది. కార్మికుల సమ్మె విషయంపై బుధవారం మధ్యాహ్నం సమావేశమైన నిర్మాతల మండలి అనంతరం మీడియా ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ.. కార్మికులకు వేతనాలు పెంచడానికి తమకెలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. రేపటి నుంచి కార్మికులందరూ షూటింగ్‌లో పాల్గొనాలని సూచించారు.

'సినీ కార్మికుల సమ్మె గురించి తెలుసుకుని మేమంతా షాకయ్యాం. సమయానుగుణంగా మేము తరచూ వేతనాలు పెంచుతూనే ఉన్నాం. అయితే, వేతనాల సడలింపుపై స్పందించమని కోరుతూ ఈనెల 6న వాళ్లు మాకు ఓ లేఖ రాశారు. వేతనాలు పెంచడానికి నిర్మాతలందరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే మాకు కూడా కొన్ని కండిషన్స్‌ ఉన్నాయి. ఒక్కసారి అందరం కలిసి కూర్చొని చర్చించుకుందామని వాళ్లకు సమాధానం ఇచ్చాం. కానీ, వాళ్లందరూ ఈరోజు ఇలా ఆకస్మికంగా సమ్మె చేయడం తప్పు.

నిర్మాతలందరూ షూటింగ్స్‌ కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రేపటి నుంచి కార్మికులందరూ షూట్స్‌కి ఎప్పటిలాగా వస్తేనే వేతనాలు, విధివిధానాలపై ఎల్లుండి చర్చించి ఒక కొలిక్కి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. లేదంటే.. షూటింగ్స్‌ చేయడానికి నిర్మాతలెవరూ సిద్ధంగా లేరు. నిర్మాతల్ని ఇబ్బందిపెట్టకండి.. వాళ్లు సినిమాలు చేస్తేనే మనకి పని ఉంటుంది. అలాగే, సమ్మె నోటీసులు మాకు పంపించినట్లు వాళ్లు చెబుతున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు' అని సి.కల్యాణ్‌ వివరించారు.

నిర్మాతలు తొందరపడొద్దు: ఫిల్మ్‌ ఛాంబర్‌

వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికుల చేపట్టిన నిరసన, దానికి నిర్మాతల మండలి సమాధానంపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి స్పందించింది. ఈ మేరకు నిర్మాతలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచి 15 రోజులపాటు పాత పద్ధతిలోనే సినీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని సూచించింది. ఫిల్మ్ చాంబర్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ కార్మికులకు వేతనాలు చెల్లించవద్దని కోరింది. సినిమా చిత్రీకరణల వివరాలు ఎప్పటికప్పుడు ఫిల్మ్ చాంబర్‌కు తెలిపాలని, నిర్మాతలెవరూ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొవద్దని పేర్కొంది. కార్మిక సంఘాల ఒత్తిళ్లకు ఎవరూ గురికావొద్దని, నిర్మాతల మండలి సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు నిర్మాతలందరికీ తెలియజేస్తామని చలన చిత్ర వాణిజ్య మండలి స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: ప్రైవేట్ పార్టీలో చిరు, సల్మాన్​, వెంకీ సందడి..

Last Updated : Jun 22, 2022, 9:24 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.