Producer bunny vas on OTT Release: ఓటీటీలో సినిమాల విడుదలపై నిర్మాత బన్నీవాసు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై బుధవారం నిర్మాతల సమావేశం ఉందని చెప్పారు. కొత్త సినిమాలను 50 రోజుల వరకు ఓటీటీకి ఇవ్వొద్దని నిర్మాతలు యోచిస్తున్నారని తెలిపారు. ఓటీటీలో రిలీజ్ చేయజం వల్ల థియేటర్ వ్యవస్థకే కాదు పెద్ద హీరోలకు తీరని నష్టమని వాపోయారు.
"కొత్త సినిమాలను 50రోజుల వరకు ఓటీటీలో విడుదల చేయకూడదని నిర్మాతలు భావిస్తున్నారు. దీనిపై బుధవారం సమావేశం జరగనుంది. డిజిట్లో రిలీజ్ చేయడం వల్ల పెద్ద హీరోల షర్మిషా కూడా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమా విడుదల విషయంలో ఓ పెద్ద హీరో.. నిర్మాతతో ఒప్పందం చేసుకున్నాడు. తన అనుమతి లేకుండా 50 రోజుల వరకు సినిమా ఓటీటీలోకి ఇవ్వొద్దని ఒప్పందం కుదుర్చుకున్నాడు." అని అన్నారు.
ఇదీ చూడండి: స్టార్ హీరో కుమారుడి హల్చల్.. పదేళ్ల వయసుకే స్పోర్ట్స్ కార్ నడిపి యాక్సిడెంట్