జీవితంలో ఎవర్నీ నమ్మవద్దని ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ అన్నారు. ఎవరైనా సరే వాడుకుని వదిలేస్తారని, అందుకే మనల్ని మనమే నమ్ముకోవాలని పేర్కొన్నారు. "జీవితం చాలా చిన్నది. ప్రతి ఒక్కరికీ ఒక్కటే చెబుతున్నా. దయచేసి ఎవరినీ నమ్మకండి. ఎవరూ మనకు సాయం చేయరు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోరు. వీలైతే వాడుకుని వదిలేస్తారు. మోసం చేస్తారు. తర్వాత మనల్ని పక్కన పడేస్తారు. ఇంకో ఆడుకునే వస్తువు వస్తుంది. మళ్లీ ఆ ఆటబొమ్మతో ఆడుకుంటారు. ఆడుకునేవాడు ఒక్కడే.. కానీ, ఆటబొమ్మలు చాలా ఉంటాయి. దీనిని బట్టి మీకు చెప్పేది ఏమిటంటే.. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇతరుల్ని నమ్మితే మీ గొంతు మీరే కోసుకున్నట్టు అవుతుంది. మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. మీ శక్తి సామర్థ్యాలను నమ్మండి. ఎంతటి పెద్దవాళ్లనైనా గౌరవించండి. కానీ.. మనకు సాయం చేస్తారని మాత్రం ఆశించకండి" అంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన పలువురు నెటిజన్లు.. 'ఏమైంది అన్నా.. మీరెందుకు ఇలా ట్వీట్ పెట్టారు?', 'మిమ్మల్ని ఎవరు మోసం చేశారు?', 'మీరు సాధారణంగా జీవిత సందేశం ఇస్తున్నారా? లేదా మీకు ఎదురైన సంఘటన గురించి తెలియజేస్తున్నారా?' అంటూ వరుస కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: Unstoppable: పవన్ను బాలయ్య అడిగే ప్రశ్నలు ఇవేనటా!