ETV Bharat / entertainment

'సలార్'కు సీక్వెల్​​.. ప్రశాంత్ నీల్​ ఈ సారి ఏమన్నారంటే? - ప్రభాస్​ సలార్​ సీక్వెల్​ దర్శకుడు ప్రశాంత్​ నీల్​

Prabhas Salaar sequel: ప్రభాస్​ 'సలార్'​ రెండు భాగాలుగా రూపొందనుందని వస్తున్న వార్తలపై స్పందించారు దర్శకుడు ప్రశాంత్​ నీల్​. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..

Salaar sequel
Salaar sequel
author img

By

Published : Apr 9, 2022, 2:01 PM IST

Prabhas Salaar sequel: పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ నటిస్తున్న భారీ బడ్జెట్​ సినిమాల్లో 'సలార్'​ ఒకటి. రూ.200కోట్లకు పైగా బడ్జెట్​తో 'కేజీఎఫ్'​ దర్శకుడు ప్రశాంత్​ నీల్​ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో డార్లింగ్​ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్​. ఇప్పటివరకు 30శాతం చిత్రీకరణ పూర్తైంది. ఈ చిత్రంలోని పోస్టర్లు ఇప్పటికే అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రం కూడా 'కేజీఎఫ్'​ తరహాలోనే రెండు భాగాలుగా రానుందని సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రచారం సాగుతోంది. గతంలోనే దీన్ని చిత్రబృందం ఖండించింది. అయితే ఈ ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా 'కేజీఎఫ్ 2' ప్రమోషన్స్​లో పాల్గొన్న ప్రశాంత్​ నీల్​ 'సలార్​' సీక్వెల్​పై మరోసారి స్పష్టతనిచ్చారు. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని చెప్పారు.

"రెండు భాగాలుగా తెరకెక్కించాలని ప్రస్తుతం ఏమీ సన్నాహాలు చేయట్లేదు. ప్రభాస్​తో ఈ విషయం గురించి చర్చిస్తున్నాను. ఆయన గ్రీన్​ సిగ్నల్​ ఇస్తే అప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతానికైతే సింగిల్​ పార్ట్​ సినిమాగానే రిలీజ్​ చేయాలని అనుకుంటున్నాం" అని ప్రశాంత్​ అన్నారు. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్​ హీరోయిన్​గా నటిస్తుండగా.. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇదీ చూడండి: ఫారెన్​లో బన్నీ గ్రాండ్​ పార్టీ.. రొమాంటిక్​గా​ శౌర్య.. 'ఆర్​ఆర్​ఆర్'​ కలెక్షన్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.