ETV Bharat / entertainment

రామోజీ ఫిల్మ్‌సిటీలో బాలకృష్ణ-ప్రభాస్‌ - బాలకృష్ణ గోపిచంద్​ మలినేని సినిమాలు

ప్రభాస్​ 'ప్రాజెక్ట్​ కె', బాలకృష్ణ 107వ చిత్రాలు హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో శరవేగంగా చిత్రీకరణలు జరుపుకుంటున్నాయి. ఆ వివరాలు...

Ramoji film city
రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రభాస్​ బాలకృష్ణ
author img

By

Published : Apr 14, 2022, 6:56 AM IST

Ramoji film city Balakrishna gopichand malineni movie: అగ్ర తారల సినిమాలకు చిరునామాగా మారింది రామోజీ ఫిల్మ్‌సిటీ. ఓ వైపు సెట్స్‌ పనులు... మరోవైపు చిత్రీకరణలతో బిజీ బిజీగా గడుపుతున్నాయి ఆయా చిత్రబృందాలు. అగ్ర కథానాయకులు బాలకృష్ణ, ప్రభాస్‌ చిత్రాలు అక్కడ చిత్రీకరణ జరుపుకొంటున్నాయి. బాలయ్య కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రుతిహాసన్‌ కథానాయిక. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా ఓ ఇంటి సెట్‌ని తీర్చిదిద్దారు. అక్కడే కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. కథానాయకుడి పరిచయ సన్నివేశాలు మొదలుకొని, మరికొంత టాకీభాగాన్ని ఈ షెడ్యూల్‌లో తెరకెక్కిస్తున్నామని, ప్రధాన తారాగణమంతా ఇందులో పాల్గొంటోందని సినీ వర్గాలు చెప్పాయి. నిజ జీవిత ఘటనలతో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నారు.

Ramoji film city Prabhas Project K movie: ప్రభాస్‌ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై 'ప్రాజెక్ట్‌ కె' తెరకెక్కుతోంది. దీపికా పదుకొణే కథానాయిక. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీదత్‌ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో తీర్చి దిద్దిన సెట్స్‌లో జరుగుతోంది. సింహభాగం సన్నివేశాల్ని ఇక్కడే తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేసింది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇదీ చూడండి: వినోదానికి విరామం లేదు మిత్రమా.. ఈ వేసవి అగ్ర హీరోలదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.