Prabhas Mangalore Temple: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం కర్ణాటక వెళ్లారు. శుక్రవారం (జనవరి 12) సాయంత్రం ఈ ఈవెంట్ జరగనుంది. మూవీటీమ్, అతికొద్ది మంది సెలబ్రిటీలు ఈ ఈవెంట్‌కు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్, సినిమా నిర్మాత కిరగందూర్‌తో కలిసి మంగళూరులోని శ్రీ దుర్గా పరమేశ్వరీ మాత ఆలయాన్ని సందర్శించారు.
ఆలయ అర్చకులు వీరికి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, పూజారులు హీరో ప్రభాస్‌కు అమ్మవారి ఫొటోను అందించారు. ఆలయ నిర్వహకులతో ముచ్చటించిన ప్రభాస్, కాసేపు మందిరం ప్రాంగణంలో తిరిగారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
Darling #Prabhas seeking blessings at Sri Durga Parameshwari Temple after #Salaar blockbuster success🙏#SalaarBlockbuster #SalaarBoxOfficeStorm #PrabhasEra #PrabhasGirlsFC pic.twitter.com/U3QMe1T1Go
— PrabhasGirlsFC (@PrabhasGirlsFC) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Darling #Prabhas seeking blessings at Sri Durga Parameshwari Temple after #Salaar blockbuster success🙏#SalaarBlockbuster #SalaarBoxOfficeStorm #PrabhasEra #PrabhasGirlsFC pic.twitter.com/U3QMe1T1Go
— PrabhasGirlsFC (@PrabhasGirlsFC) January 12, 2024Darling #Prabhas seeking blessings at Sri Durga Parameshwari Temple after #Salaar blockbuster success🙏#SalaarBlockbuster #SalaarBoxOfficeStorm #PrabhasEra #PrabhasGirlsFC pic.twitter.com/U3QMe1T1Go
— PrabhasGirlsFC (@PrabhasGirlsFC) January 12, 2024
ఇక సలార్ విషయానికొస్తే, డిసెంబర్ 22న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో కలిపి ఈ సినిమా రిలీజైంది. సూపర్ హిట్ టాక్ అందుకున్న సలార్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. ఇక వరల్డ్‌వైడ్‌గా సలార్ పార్ట్ 1 రూ.700 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నటుడు పృథ్వీరాజ్, జగపతిబాబు, శ్రేయా రెడ్డి, ఝాన్సీ, సప్తగిరి తదితరులు ఆయా పాత్రల్లో నటించారు.
KalKi 2898 AD Release Date: ప్రభాస్ ప్రస్తుతం 'కల్కీ 2898 AD' షూటింగ్లో బిజిగా ఉన్నారు. ఈ సినిమాను నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ జానర్కలో తెరకెక్కిస్తున్నారు. కాగా, పాన్ వరల్డ్రేంజ్లో రూపొందుతున్న కల్కీ 2024 మే 9 విడుదల కానున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీ దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.