ETV Bharat / entertainment

ప్రభాస్ - కనగరాజ్ లేటెస్ట్ మూవీ! మైత్రి మూవీమేకర్స్ బడా ప్లాన్? - కనగరాజ్ లియో సినిమా

Prabhas Lokesh Kanagaraj Movie : రెబల్​ స్టార్ ప్రభాస్ - డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్​లో ఓ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాను మైత్రి మూవీమేకర్స్ భారీ బడ్జెట్​తో ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Prabhas Lokesh Kanagaraj Movie
ప్రభాస్ కనగరాజ్ సినిమా
author img

By

Published : Aug 1, 2023, 8:15 PM IST

Prabhas Lokesh Kanagaraj Movie : పాన్​ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో 'విక్రమ్' ఫేమ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ - ప్రభాస్ కాంబినేషన్​లోనూ ఓ సినిమా రాబోతోందని సినీఇండస్ట్రీలో హాట్ టాపిక్​గా మారింది. కాగా ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించనుందని సమాచారం.

ప్రస్తుతం విజయ్ దళపతితో.. 'లియో' ప్రాజెక్ట్​లో బిజీగా ఉన్నారు లోకేశ్ కనగరాజ్. కాగా తెలుగు, తమిళంలో కలిపి ఇదివరకు లోకేశ్.. 'అవియాల్', 'నగరం', 'వెల్ల రాజా', 'ఖైదీ', 'మాస్టర్', 'విక్రమ్', 'మైఖేల్' సినిమాలు తెరకెక్కించారు. ఇందులో తెలుగు హీరో సందీప్ కిషన్​తో 'నగరం', 'మైఖేల్' రెండు సినిమాలు చేశారు లోకేశ్. గతేడాది తమిళ స్టార్ కమల్ హసన్​ హీరోగా 'విక్రమ్' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు లోకేశ్. ఇక ప్రభాస్​తో సినిమా ఓకే అవ్వాలంటూ.. డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Mythri Movie Makers : కాగా మైత్రి మూవీమేకర్స్ ప్రభాస్​తో సినిమా కోసం.. ముందుగా బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంను సంప్రదించారట. కానీ ఇప్పటివరకూ ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్​లోకి లోకేశ్ కనగరాజ్ ఎంట్రీ ఇవ్వనున్నాడని సినీవర్గాల టాక్. ఒకవేళ ఇదే జరిగితే.. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.

అయితే ప్రభాస్ ప్రస్తుతం 'సలార్', 'కల్కి' షూటింగుల్లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ డెరెక్షన్​లో తెరకెక్కుతున్న సలార్.. సెప్టెంబర్​లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు 'కల్కి' శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఈ సినిమాలతో పాటు ప్రభాస్ - డైరెక్టర్ మారుతి కాంబినేషన్​లో ఓ సినిమా రానుంది. ఈ సినిమాకు 'రాజా డిలక్స్'అనే వర్కింగ్ టైటిల్​ను ఎంపిక చేశారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ కూడా ప్రభాస్​తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్​ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.