ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూసిన తన పెద్దనాన్న సీనియర్ నటుడు కృష్ణంరాజును.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులు ఓ వీడియోను క్రియేట్ చేసి సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. అందులో ఒకవైపు కృష్ణంరాజు నటించిన చిత్రాలలోని పాత్రలు, మరోవైపు ప్రభాస్ నటించిన చిత్రాలలోని సన్నివేశాలను ఒకదానితో ఒకటి కలిసేలా మిక్స్ చేశారు. ఆ ప్రతి ఫ్రేమ్ అభిమానులను కట్టిపడేస్తోంది. 'ఎడిటింగ్ చాలా బాగుంది', 'సేమ్ మేనరిజం' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
కాగా, కృష్ణంరాజు మరణంతో షూటింగ్లకు కాస్త బ్రేక్ ఇచ్చిన ప్రభాస్.. తాజాగా 'సలార్' చిత్రాన్ని పునఃప్రారంభించారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్ కథానాయిక. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో తాజాగా ప్రారంభమైంది.
-
#Prabhas𓃵 anna posted this video in both Fb & insta🥰
— saaho (@saahoupendra548) September 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Congrats bro @AyyAyy0 ❤️pic.twitter.com/k8v0fWySdb
">#Prabhas𓃵 anna posted this video in both Fb & insta🥰
— saaho (@saahoupendra548) September 24, 2022
Congrats bro @AyyAyy0 ❤️pic.twitter.com/k8v0fWySdb#Prabhas𓃵 anna posted this video in both Fb & insta🥰
— saaho (@saahoupendra548) September 24, 2022
Congrats bro @AyyAyy0 ❤️pic.twitter.com/k8v0fWySdb
ఇదీ చూడండి: జబర్దస్త్ రోహిణి సర్ప్రైజ్.. తండ్రికి అదిరిపోయే గిఫ్ట్