ETV Bharat / entertainment

ప్రభాస్​ 'కల్కి' - అఫీషియల్​ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్​ - ప్రభాస్ కల్కి 2898ఏడి

Prabhas Kalki Movie Release Date : ప్రచారంలో ఉన్నట్టుగానే 'కల్కి 2898 AD' రిలీజ్​ డేట్​ను అఫీషియల్​గా అనౌన్స్ చేశారు మేకర్స్. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

ప్రభాస్​ 'కల్కి' - అఫీషియల్​ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 10:19 AM IST

Updated : Jan 12, 2024, 12:34 PM IST

Prabhas Kalki Movie Release Date : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా నుంచి కూడా నెక్స్ట్ రాబోతున్న బిగ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది 'కల్కి 2898 AD'. భారీ అంచనాలు ఉన్న ఈ సైన్స్​ ఫిక్షన్​ మాసివ్ ప్రాజెక్ట్ తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినిమా స్టాండర్డ్స్​ను ప్రపంచస్థాయిలో నిలుపుతుందని సినీ ప్రియులంతా ఎంతో నమ్మకంగా ఉన్నారు.

అయితే ఈ భారీ చిత్రం రిలీజ్ డేట్ గురించి గత కొన్ని రోజులగా ఓ సాలిడ్ బజ్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 9న(Kalki Release Update) సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు అనుకున్నట్టుగానే అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. ఈ మే 9నే కల్కి చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్​ కన్ఫర్మ్ చేశారు. నేడు థియేటర్లలో రిలీజైన సినిమాలతో పాటు అఫీషియల్​గా ఈ విడుదల తేదీని అనౌన్స్ చేశారు.

దీంతో ఈ మోస్ట్​ అవైటెడ్ మూవీ రిలీజ్ డేట్ తెలుసుకుంటున్న ప్రభాస్ అభిమానులు - సినిమాను బిగ్ స్క్రీన్స్ మీద ఎక్స్​పీరియెన్స్​ చేసేందుకు రెడీగా ఉన్నట్లు కామెంట్ల రూపంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే సినిమాలో ఎంతోమంది ఇతర భాషలకు చెందిన అగ్ర నటీనటులు ఉన్నారు. యూనివర్సల్ స్టార్​ కమల్ హాసన్, బిగ్​ బీ అమితాబ్ బచ్చన్​ లాంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీస్​ దిశా పటానీ, దీపికా పదుకొణె హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహానటి తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్​తో సినిమాను నిర్మిస్తోంది. మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇక ఆ మధ్యలో కామికాన్‌ వేదికగా విడుదల చేసిన 'కల్కి' ఫస్ట్‌ గ్లింప్స్‌నకు(Kalki Glimpse) విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.

  • Whoever sees the #Kalki2898AD surprise first, tag us and let the world know 💥💥💥

    — Kalki 2898 AD (@Kalki2898AD) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రివ్యూ : గుంటూరు కారం - ఆ రెండే హైలైట్స్​ - సినిమా ఘాటుగా ఉన్నట్టేనా?

రివ్యూ : 'హనుమాన్' విశ్వరూపం - గూస్​బంప్స్​ గ్యారంటీ

Last Updated : Jan 12, 2024, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.