ETV Bharat / entertainment

Adipurush tickets: సూపర్​ ఆఫర్‌.. ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ - ఆదిపురుష్ టికెట్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ

ప్రభాస్‌, కృతిసనన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన భారీ బడ్జెట్‌ చిత్రం 'ఆదిపురుష్'. ఈ మూవీటీమ్​ ఓ ఆఫర్ ప్రకటించింది. ఒక టికెట్‌ ధరకే రెండు టికెట్లు పొందొచ్చని తెలిపింది. ఎలా అంటే?

Adipurush ticket offer
Adipurush tickets: సూపర్​ ఆఫర్‌.. ఒకటి కొంటే ఇంకొటి ఫ్రీ
author img

By

Published : May 11, 2023, 6:53 AM IST

Updated : May 11, 2023, 7:22 AM IST

'ఆదిపురుష్‌' మూవీటీమ్​ ప్రేక్షకులకు సూపర్​ ఆఫర్‌ ప్రకటించింది. ఒక టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీగా పొందే అవకాశాన్ని కల్పించింది. 'పేటీఎం' ద్వారా ఇలా రెండు టికెట్ల ఆఫర్​ పొందొచ్చని సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్ చేసింది. అయితే, దీనికి కొన్ని కండిషన్స్​ వర్తిస్తాయని వెల్లడించింది పేటీఎం. ఈ ఆఫర్‌ జూన్‌ 30 వరకే ఉంటుందని వెల్లడించింది. ముందుగా రూ.100 చెల్లిస్తే ప్రోమో కోడ్‌ వస్తుందని, టికెట్‌ బుక్‌ చేసుకునే ముందు దాన్ని అప్లై చేస్తే రూ. 400 వరకు క్యాష్‌బ్యాక్‌ వస్తుందని పేర్కొంది. కనీసం రూ. 350 ధర ఉన్న టికెట్‌కే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని చెప్పుకొచ్చింది. అంటే.. రెండు టికెట్లు బుక్‌ చేయాల్సి వస్తే ట్యాక్స్‌తో కలిపి రూ.700కిపైగానే ఖర్చు అవుతుంది. అదే పేటీఎం ఆఫర్‌ కోడ్‌ను వినియోగిస్తే సగానికి తగ్గే అవకాశం ఉంటుంది.

సినిమా విషయానికొస్తే.. ఈ ఇతిహాసగాథ చిత్రంలో పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్‌ టైటిల్​ రోల్ పోషించారు. బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రాన్ని.. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని 3డీ వెర్షన్‌లో తీర్చిదిద్దారు. ఇందులో రాముడిగా ప్రభాస్‌ నటించగా.. కృతిసనన్‌ సీతగా నటించింది. రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌ కనిపించునున్నారు. వరల్డ్​ వైడ్​గా ఎన్నో భాషల్లో ఈ సినిమా జూన్‌ 16న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. అంతకన్నా ముందే ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక 'ట్రిబెకా ఫెస్టివల్‌'లో ప్రదర్శించనుండటం విశేషం. న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 7 నుంచి 18 వరకు జరగనున్న ఆ గ్రాండ్ ఈవెంట్​లో 'ఆదిపురుష్‌'ను జూన్‌ 13న ప్రదర్శించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్​ పోన్​ ప్రొడక్షన్స్​ పనులను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నాయి. విజువల్​ ట్రీట్​ కూడా అస్సలు బాలేదని అభిమానులు తీవ్ర​ నిరాశ వ్యక్తం చేశారు. దీంతో మూవీటీమ్​ మరింత సమయం తీసుకుని.. వీఎఫ్‌ఎక్స్‌ను మరింత నాణ్యతతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా విజువల్స్‌ను తీర్చిదిద్దింది. అలా రీసెంట్​గా వచ్చిన రామనవమి పోస్టర్‌, హనుమంతుడి పోస్టర్‌, జై శ్రీరామ్‌ సాంగ్​.. నెగెటివిటీని కాస్త దూరం చేస్తూ వచ్చాయి. ఈ క్రమంలోనే ట్రైలర్​ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రికార్డ్​ స్థాయిలో వ్యూస్​, కామెంట్స్ వచ్చాయి. ప్రచార చిత్రం బాగుందని అభిమానులు ప్రశంసించారు.

Adipurush tickets
ఆదిపురుష్​​ ఆఫర్‌.. ఒకటి కొంటే ఇంకొటి ఫ్రీ

ఇదీ చూడండి: Adipurush trailer : రావణుడికి నో స్పేస్​.. ప్రభాస్ డైలాగ్​ సేమ్​ అదే ఫీలింగ్​

Last Updated : May 11, 2023, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.