ETV Bharat / entertainment

'ఆదిపురుష్'​​.. తెలుగు రాష్ట్రాల్లో కళ్లు చెదిరే డీల్!.. ఎన్ని వందల కోట్లంటే? - ఆదిపురుష్ రిలీజ్ డేట్​

Adipurush Theatrical rights : ప్రభాస్​ నటించిన 'ఆదిపురుష్'​ మరో 20 రోజుల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్​ బిజినెస్​ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు ధరకు జరిగిందని తెలిసింది. ఆ వివరాలు..

Adipurush
'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ బిజినెస్​.. తెలుగు రాష్ట్రాల్లో కళ్లు చెదిరే డీల్!​
author img

By

Published : May 28, 2023, 5:04 PM IST

Updated : May 28, 2023, 5:32 PM IST

Adipurush Theatrical rights : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ నటించిన 'ఆదిపురుష్' జూన్ 16న వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. అంటే సినిమా రిలీజ్​కు మరో 20 రోజులు మాత్రమే ఉంది. అయితే తాజాగా అదిరిపోయే సమాచారం అందింది. ఈ చిత్ర తెలుగు రాష్ట్రాల థియేట్రికల్​ హక్కులను కళ్లు చెదిరే రేటుకు ఓ బడా నిర్మాణ సంస్థ తీసుకుందట. ప్రస్తుతం ఈ విషయం సోషల్​మీడియాలో హాట్ టాపిక్​గా మారింది.

Prabhas Maruthi Movie : తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... థియేట్రికల్ హక్కులను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుందని సమాచారం అందింది. రూ. 170 కోట్లకు కొనుగోలు చేసిందట. అంతకుముందు ఈ చిత్ర హక్కులు యూవీ క్రియేషన్స్​ రూ.100కోట్లకు కొనుగోలు చేయగా.. అది రూ.70కోట్ల లాభంతో పీపుల్స్​ మీడియాకు అమ్మిందట. ఇకపోతే ఈ పీపుల్స్​ మీడియా బ్యానర్​లో ప్రస్తుతం ప్రభాస్​ ఓ సినిమా కూడా చేస్తున్నారు. దీనికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా, అంతకుముందు తెలుగులో జరిగిన భారీ థియేట్రికల్ రైట్స్ డీల్స్ వివరాలు ఇలా ఉన్నాయి. 'ఆర్ఆర్ఆర్'ను రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 226 కోట్లకు కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. 'బాహుబలి 2' రూ. 120 కోట్లు, 'సాహో' రూ. 125 కోట్లు, సైరా నరసింహారెడ్డి రూ.115కోట్లు, రాధేశ్యామ్​ రూ.107కోట్లు బిజినెస్ జరిగిందట. అంటే 'ఆర్ఆర్ఆర్' తర్వాత 'ఆదిపురుష్'ది ఇప్పుడు రెండో స్థానం.

Adipurush Cast and Crew : రామాయణం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ సీతగా.. జంటగా కలిసి నటించారు. సైఫ్‌ అలీఖాన్‌ ముఖ్యభూమిక పోషించారు. రావణాసురుడిగా కనిపించనున్నారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. భూషణ్‌ కుమార్‌, క్రిష్ణకుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతారియా, రాజేష్‌ నాయర్‌, వంశీ, ప్రమోద్‌ కలిసి చిత్రాన్ని నిర్మించారు. జూన్‌ 16న పలు భాషల్లో ఆడియన్స్​ ముందుకు రానుంది. అత్యాధునిక సాంకేతిక హంగులతో చిత్రాన్ని రూపొందించారు. సన్నీసింగ్‌, దేవదత్త నాగే వత్సల్‌ సేన్‌, సోనాల్‌ చౌహాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కార్తీక్‌ పల్నాని ఛాయాగ్రహణం అందించారు. అజయ్‌ - అతుల్‌ సంగీతం సమకూర్చారు. ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్​, జై శ్రీరామ్ సాంగ్ బాగా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. సినిమాపై వచ్చిన నెగటివిటీని తొలిగించి ఆసక్తిని పెంచాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి:

Kriti Sanon Sita Look : 'ట్యూటర్​ను పెట్టుకుని తెలుగు నేర్చుకున్నాను'

Adipurush tickets: సూపర్​ ఆఫర్‌.. ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ

Last Updated : May 28, 2023, 5:32 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.