ETV Bharat / entertainment

పొన్నియిన్​ సెల్వన్​@150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షమే

author img

By

Published : May 1, 2023, 11:53 AM IST

Ponniyin Selvan 2 Box Office Collection : 'పొన్నియిన్ సెల్వన్-2' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్​తో పాటు.. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. పొన్నియిన్​ సెల్వన్న మూడో రోజు కలెక్షన్ల వివరాలు..

ponniyin selvan collections  Ponniyin Selvan 2 Box Office Collection  Ponniyin Selvan 2 Box Office Collection day 3

Ponniyin Selvan 2 Box Office Collection : ప్రముఖ దర్శకుడు మణిరత్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా 'పొన్నియిన్​ సెల్వన్'. ఈ సినిమా తొలి భాగం గ‌తేడాది విజ‌య‌వంతంగా ప్రేక్ష‌కుల్ని మెప్పించింది. ఇప్పుడు రెండో భాగం 'పొన్నియిన్​ సెల్వన్-2' కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తోంది. కోలీవుడ్​తో పాటు పాన్​ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోంది. 9వ శతాబ్దం నాటి చోళ సామ్రాజ్యం నేప‌థ్యంలో సాగే ఈ కథను క‌ల్కి కృష్ణ‌మూర్తి ర‌చించిన న‌వ‌ల ఆధారంగా రూపొందించారు. ప‌లువురు ద‌ర్శ‌కులు ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నించినప్పటికీ ఇది పట్టాలెక్కలేపోయింది. అయితే ప‌లు ప్ర‌య‌త్నాల త‌ర్వాత ఈ సినిమాను విజ‌య‌వంతంగా తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం.

ఏప్రిల్​ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్​ వద్ద మంచి టాక్​ సంపాదించడమే కాకుండా కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్తోంది.ఓపెనింగ్​లోనే అదిరిపోయే కలెక్షన్లను సొంతం చేసుకున్న 'పీఎస్-​2'.. మూడు రోజుల్లో వచ్చేసరికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల పైగా గ్రాస్​ వసూళ్లు​రాబట్టింది. ఇందులో తమిళ ప్రేక్షకుల​ షేర్​ ఎక్కువగా నమోదైందని ట్రేడ్​ వర్గాల టాక్. ఉత్తర అమెరికాలో ఈ సినిమా మూడు రోజుల్లో 3 మిలియన్​ డాలర్లు(రూ.24 కోట్లు) వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్​ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ​సుమారు 3200 కంటే ఎక్కువ స్క్రీన్‌లలో విడుదలైన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్​లోనే రూ.170కోట్ల మేర వసూళ్లు చేసినట్లు సమాచారం.

పీఎస్​-2 మూడో రోజు కలెక్షన్స్​ :

  • మొదటి రోజు - రూ. 24 కోట్లు
  • రెండో రోజు - రూ. 26.2 కోట్లు
  • మూడో రోజు - రూ. 29.14 కోట్లు
  • నాలుగో రోజు - రూ. 21 కోట్లు (సోమవారం అంచనా)

ఇక పీఎస్​ 2 సినిమా విషయానికి వస్తే.. తమిళ స్టార్​ డైరెక్టర్​ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, త్రిష కృష్ణన్, శోభితా ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్, విక్రమ్​ లాంటి స్టార్స్​ వారి వారి పాత్రల్లో అద్భుతంగా చేశారని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. అన్నీ భాషల్లోనూ ఈ సినిమాకు పాజిటివ్​ రెస్పాన్స్​ వస్తోంది. ఈ సినిమా మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో రెండవ భాగం కూడా బాక్సాఫీస్ వద్ద అంతకంటే ఎక్కువగా వసూళ్లు చేస్తుందని మేకర్స్​ భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.