Polimera 2 Movie Release Date : కథ బాగుంటే ఆ సినిమా థియేటర్స్‌లో రిలీజైనా.. ఓటీటీలోకి వచ్చిన ఆడియెన్స్ ఎంతగానో ఆదరిస్తారో తెలిసిన విషయమే. కరోనా సమయం నుంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు ఆదరణ బాగా పెరిగింది. ఇలాంటి కోవలోకి చెందిన సినిమా.. 'మా ఊరి పొలిమేర'. సత్యం రాజేశ్, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్-సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. కరోనా టైమ్‌లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను దక్కించుకుంది. ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. క్షుద్ర పూజలు, తంత్రాలు వంటి అంశాలతో ఈ చిత్రాన్ని బాగా చూపించారు. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతో మంది అభిమానుల చాలా ఆసక్తిగా ఎదురుచూశారు.
అయితే ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడా సీక్వెల్‌కు సంబంధించి ఓ సూపర్ అప్డేట్ను మూవీటీమ్ ఇచ్చింది. 'మా ఊరి పొలిమేర 2' ఈ సారి థియేటర్లలో రానున్నట్లు తెలిపింది. నవంబర్ 2న రిలీజ్ కానుందంటూ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. డాక్టర్ విశ్వనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమాలో కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, చిత్రం శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
'మా ఊరి పొలిమేర' మొదటి భాగంలో ఏం జరిగిందంటే..: కొమిరి (సత్యం రాజేశ్), జంగయ్య(బాలాదిత్య) ఇద్దరూ అన్నదమ్ములు. తెలంగాణలోని జాస్తిపల్లి అనే మారుమూల గ్రామంలో నివసిస్తుంటారు. కొమిరి ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఊళ్లో ఎవరికి ఏ సాయం కావాలన్నా ముందుండి చేస్తుంటాడు. భార్యబిడ్డలను పోషించడంతో పాటు, తమ్ముడు జంగయ్యను చదివిస్తుంటాడు. జంగయ్య చదువుకుని అదే ఊరిలో కానిస్టేబుల్ అవుతాడు. మద్యం మత్తులో కొమిరి స్నేహితుడు బలిజ(గెటప్ శ్రీను) సర్పంచ్ మనిషిని కొడతాడు. దీంతో అతడిని ఇంటికి తీసుకెళ్లి చావగొడతారు. ఇక సర్పంచ్ బందీలో ఉన్న బలిజను విడిపించటానికి వెళ్లిన కొమిరి, అతడి భార్యకు అవమానం ఎదురవుతుంది. దీంతో పెద్దవాళ్లను ఎదిరించలేక ఆ అవమాన భారంతో ముగ్గురూ ఇంటికి వస్తారు. కొన్ని రోజులకు ఊరి సర్పంచ్‌తో పాటు, కవిత(రమ్య)అనే గర్భిణి అనుమానాస్పద రీతిలో మృతిచెందుతారు. దీనికి కారణం కొమిరేనంటూ కవిత బంధువులు అతడిని చంపేస్తారు. అసలు వారి చావులకు కారణం ఎవరు? కానిస్టేబుల్ జంగయ్య ఈ కేసును ఎలా పరిష్కరించాడు? అనేది ఇందులో చూపించారు.
-
#Polimera2 in Cinemas 2nd Novemer, are you excited 😄🔥🔥 pic.twitter.com/v4o6HMk0oX
— RatpacCheck (@RatpacCheck) August 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Polimera2 in Cinemas 2nd Novemer, are you excited 😄🔥🔥 pic.twitter.com/v4o6HMk0oX
— RatpacCheck (@RatpacCheck) August 30, 2023#Polimera2 in Cinemas 2nd Novemer, are you excited 😄🔥🔥 pic.twitter.com/v4o6HMk0oX
— RatpacCheck (@RatpacCheck) August 30, 2023