- " class="align-text-top noRightClick twitterSection" data="">
Ajith valimai bomb: తమిళ అగ్రహీరో అజిత్ నటించిన 'వలిమై'.. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు(ఫిబ్రవరి 24) థియేటర్లలో రిలీజైంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల ప్రేక్షకుల్ని అలరిస్తోంది. అయితే ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్ వద్ద బాంబు పేలడం కలకలం సృష్టించింది.
ఇంతకీ ఏం జరిగింది?
తమిళనాడులో కోయంబత్తూర్‌లో దాదాపు 20 స్క్రీన్స్‌లో 'వలిమై' రిలీజ్ చేశారు. గురువారం ఉదయం 5 గంటల సమయంలో గంగా థియేటర్లో బెన్ఫిట్ షో రన్ అవుతున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతుకులు.. థియేటర్ బయట పెట్రోల్ బాంబు విసిరి పారిపోయినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని లేనప్పటికీ, ఓ బైక్ మాత్రం పాక్షికంగా దెబ్బతింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై వారు స్పందించాల్సి ఉంది.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన 'వలిమై' సినిమాలో అజిత్ హీరోగా నటించారు. తెలుగు నటుడు కార్తికేయ.. విలన్‌గా చేశారు. హ్యుమా ఖురేషి కీలకపాత్ర పోషించారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. బోనీ కపూర్ నిర్మాత.
ఇవీ చదవండి: