Bro movie ticket sales : తెలుగు బాక్సాఫీస్ ముందు కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ ఓ బడా చిత్రం రానుంది. అదే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్రో' సినిమా. మెగాహీరో సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించారు. మరో రోజులో(జులై 28) రిలీజ్ కానుంది. ఇది పవన్ సినిమా కావడంతో టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఈ వారం మంచి వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే పవన్ గత సినిమాలతో పోలిస్తే.. ఈ చిత్రానికి కాస్త హైప్ తక్కువగా ఉందని మరికొందరు అంటున్నారు.
ఎందుకంటే సినిమా రీమేక్ అండ్ క్లాస్ మూవీ కావడం.. ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. ఇప్పుటికే రిలీజైన ఈ సినిమా పాటలు మొదట అంతగా ఆకట్టుకోలేదు. మొదటి రెండు పాటలు నిరుత్సాహపరిచాయి. అయితే తాజాగా రిలీజైన బ్రో థీమ్ లిరికల్ వీడియో సాంగ్ మాత్రం బాగా హైప్ క్రియేట్ చేసింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడీ సినిమా బుకింగ్స్, ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అన్న అనుమానాలు వస్తున్నాయి సినీ ప్రియుల్లో. అయితే బుధవారం ఆ సందేహాలన్నింటికీ తెరపడింది.
రిలీజ్‌కు రెండు రోజుల ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టికెట్ల అమ్మకాలు ఆన్లైన్లో బాగానే జరుగుతున్నాయి. బుకింగ్స్ జోరుగా ఉన్నప్పటికీ.. పవన్ గత సినిమాలతో పోలిస్తే..ఈ సారి కాస్త స్లోగా ఉందని అంటున్నారు. కానీ అది పెద్దగా ఎఫెక్ట్ కాదని చెబుతున్నారు అంతకుముందు నిమిషాల్లో అయ్యే బుకింగ్స్.. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ టైమ్ తీసుకుంటోందట. చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అందుబాటులో ఉన్న మెజారిటీ థియేటర్లలో ప్రదర్శనకానుంది.
ఇక ఈ చిత్ర రన్ టైమ్ 2 గంటల 15 నిమిషాలు మాత్రమే. అందుకే షోలను మరీ ముందుగా ఏమీ వేయట్లేదని తెలిసింది. రెగ్యులర్ టైమ్ ప్రకారమే పడబోతున్నాయట. తొలి వీకెండ్లో ఐదు షోలు ప్రదర్శించబోతున్నారట. ఇకపోటే నిర్మాత విశ్వప్రసాద్ అంతకుముందు చెప్పినట్టే టికెట్ల ధరలను కూడా పెంచలేదు. రెగ్యులర్ రేట్లకే విక్రయిస్తున్నారు. మొత్తంగా బుకింగ్స్ జోరు చూస్తుంటే డీసెంట్ ఓపెనింగ్స్ వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదని అనిపిస్తోంది. అయితే పవన్ గత సినిమాల రికార్డులను బ్రేక్ చేయడమ కష్టమే అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
ఇదీ చూడండి :
Bro Movie Premiere : ఓవర్సీస్లోనూ 'బ్రో' హవా.. ప్రీమియర్ కలెక్షన్లు ఎంతంటే?
కోలీవుడ్‌కు పవన్ కీలక సూచన.. అలా చేస్తేనే 'RRR' లాంటి సినిమా చేయగలరంటూ..