'హరిహర వీర మల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'వినోదాయ సీతం' రీమేక్.. ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ ఓజీ మూవీ శనివారం జరిగిన పూజా కార్యక్రమంతో పట్టాలెక్కింది. ముంబయిలో తొలి షెడ్యూల్ ప్రారంభమయ్యింది. ప్రస్తుతం జరుగుతున్న చిత్రీకరణ కోసం వారం తర్వాత పవన్ ముంబయికి పయనమవ్వనున్నారని సమాచారం. షూటింగ్ ప్రారంభమయ్యిందన్న విషయాన్ని తెలియజేస్తూ.. చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. రిలీజైన నిమిషాల్లోనే కొన్ని లక్షల వ్యూస్ అందుకున్న ఆ వీడియో చూస్తే.. అందులో కొన్ని ఆసక్తికర అంశాలు బయటపడతాయి. అవేంటంటే..
క్లైమాక్స్ నంబర్ -16
వీడియో మొదట్లో ఓ నలిపేసిన పేపర్ నేలపై పడుతుంది. అందులో క్లైమాక్స్ 14 అని ఉంది. ఆ తర్వాత చూస్తే డస్ట్ బిన్ మొత్తం అలాంటి పేపర్స్ కనిపిస్తాయి. ఇక తీక్షణంగా ఏదో రాస్తూ కనిపించిన దర్శకుడు చివరకు క్లైమాక్స్ నంబర్ 16ను ఫైనలైజ్ చేస్తారు. దీని బట్టి ఆయన ఈ సినిమా కోసం చాలా డ్రాఫ్ట్స్ రాసినట్టు తెలుస్తోంది. అలా 15 క్లైమాక్స్‌లను రిజెక్ట్ చేసి చివరిది ఓకే చేశారన్న మాట.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పోర్టులో పోరు
వీడియోలో ఓ స్క్రిప్ట్ పేపర్ కనిపిస్తుంది. అందులోని ఓ సీన్‌ను ఇలా వివరించారు డైరెక్టర్.. డంగి, ఫైజల్ అనే ఇద్దరు గూండాలు ముంబయి పోర్టుకు మార్గంలా ఉండే ఓ పెద్ద ఇనప గేట్ ముందు వంద మందికిపై అనుచరులతో నిలబడుతారు. 'ఇంతమందిని దాటి ఇక్కడికి రావాలి అని అనుకుంటే వాడి కంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండదు' అని విలన్లలో ఒకరైన డంగి అంటాడు.
కట్ చేస్తే.. బుల్లెట్ల శబ్దం వినిపించడం వల్ల డంగి, ఫైజల్.. ఇద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు. వాళ్ల ముందు ఓ స్మోక్ బాంబ్ పడుతుంది. ఇక ఆ పొగలో నుంచి ఓ మనిషి రూపం కనబడుతుంది. నల్ల మబ్బులు కమ్మిన ఆకాశంలో నుంచి ఓ మెరుపు వచ్చినట్లు వస్తాడు ఆ వ్యక్తి. అతను ఇంకెవరో కాదు మన ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ పవన్ కల్యాణ్. ఈ స్క్రిప్ట్ షీట్‌ను చూస్తుంటే ముంబయి పోర్ట్ సీన్లోనే హీరో సినిమాల్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి సీన్స్ కావలనుకునే పవర్ స్టార్ ఫ్యాన్స్.. ఈ ఒక్క హింట్‌తో సీన్ మొత్తం ఎలా ఉంటుందో ఊహించుకుని ఆనందపడుతున్నారు. ఇక వీడియోలో వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సైతం ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.