ETV Bharat / entertainment

Pathan Movie : బంగ్లాదేశ్​లో 'పఠాన్​' రిలీజ్​.. తొలి చిత్రంగా రికార్డు - పఠాన్​ సినిమా న్యూస్​

Pathan Movie Bangladesh Release : బాయ్​కాట్​ సెగ తాకినా.. బాక్సాఫీస్​ ముందు కలెక్షన్లు సూనామీ సృష్టించింది షారక్​ ఖాన్​ సినిమా 'పఠాన్​'. ఇప్పుడు పొరుగు దేశం బంగ్లాదేశ్​లనూ విడుదలకు సద్ధమైంది. ఆ వివరాలు..

Pathan Movie Bangladesh Release
Pathan Movie Bangladesh Release
author img

By

Published : May 5, 2023, 7:21 PM IST

Pathan Movie Bangladesh Release : నాలుగేళ్ల విరామం తర్వాత 'పఠాన్'తో వెండితెరపై కనిపించారు బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో సూపర్ హిట్ అయింది. దాదా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు యాక్షన్ డ్రామా మరో మెట్టు పైకెక్కి.. బంగ్లాదేశ్‌లో విడుదలకు సిద్ధమైంది. అంతేకాకుండా బంగ్లాదేశ్​లో విడుదలైన తొలి హిందీ సినిమాగానూ రికార్డు సృష్టించింది.

షారుక్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన 'పఠాన్'.. ఈ నెల 12న బంగ్లాదేశ్‌లో విడుదల కానుంది. 1971 తర్వాత అక్కడ విడుదలవుతున్న తొలి హిందీ సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ విషయమై డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రతినిధి నెల్సన్ డిసౌజా మాట్లాడారు. విభిన్న దేశాలు, సంస్కృతులను కలిపే శక్తి సినిమాకు మాత్రమే ఉందన్నారు. వ్యక్తుల మధ్య బంధాలను పెంచడంలో సినిమాకి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా.. అక్కడ కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్​ గతంలో చేసిన ఓ ట్వీట్ వైరల్​గా మారింది 'పఠాన్‌' రిలీజైన తర్వాత అభిమానులతో మాట్లాడారు. అప్పుడు ఓ అభిమాని 'మీ సినిమాను బంగ్లాదేశ్‌లో విడుదల చేయొచ్చు కదా?' అని అడిగాదడు.. దీనికి 'త్వరలో మీరు పఠాన్‌ను బంగ్లాదేశ్​ చూస్తారు' అని షారుక్ బదులిచ్చారు. ఇప్పుడు ఆ ట్వీట్‌ను షారుక్ అభిమానులు షేర్ చేస్తున్నారు.

Deepika Padukone Pathan : ఇకపోతే పఠాన్ సినిమా విషయానికొస్తే.. షారుక్​కు జంటగా బాలీవుడ్​ బ్యూటీ దీపికా పదుకొణే నటించారు. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా.. సూపర్​ హిట్​గా నిలిచి బాలీవుడ్​కు పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది. సిద్దార్థ్​ ఆనంద్​ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం విలన్​ రోల్​ పోషించారు. డింపుల్​ కపాడియా, రాణా అశుతోష్ ముఖ్య పాత్రల్లో నటించారు. యశ్​రాజ్​ ఫిలింస్​ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు.

Jawan Release Date 2023 : షారుక్​.. ప్రస్తతం అట్లీ దర్శకత్వంలో​ 'జవాన్'​ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ కోసం చిత్ర బృందం దాదాపు 25 పేర్లను పరిశీలించిందట. ఈ సినిమాలో​ షారుక్​ సరసన నయనతార నటిస్తోంది. ఇక, మక్కల్​ సెల్వన్​ విజయ్​ సేతుపతి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. కాగా జవాన్​లో షారుక్ డబుల్ రోల్​లో అభిమానులను అలరించనున్నారు. ఈ ఏడాది జూన్​లో సినిమా విడుదలకు చేయడానికి చిత్ర యూనిట్​ సన్నాహాలు చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.