ETV Bharat / entertainment

ఉత్కంఠగా 'పరంపర సీజన్‌ 2' ట్రైలర్‌.. ఊపేస్తున్న నితిన్​-అంజలి మాస్​ సాంగ్​ - పరంపర సీజన్​ 2 ట్రైలర్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'పరంపర' సీజన్​ 2 ట్రైలర్​, నితిన్​ 'మాచర్ల నియోజకవర్గం' సాంగ్​ ప్రోమో, ఆది 'క్రేజీ ఫెలో' రిలీజ్​ డేట్​ సంగతులు ఉన్నాయి.

parampara season 2
పరంపర సీజన్​ 2
author img

By

Published : Jul 8, 2022, 2:05 PM IST

Nithin Anjali special song promo: నితిన్​ హీరోగా నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం ఆగస్టు 12న రిలీజ్​ కానుంది. ఈ మూవీతో ఎడిటర్​ ఎంఎస్​ రాజశేఖర్​ రెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నారు. కృతిశెట్టి, కేథరీన్​ హీరయిన్లుగా నటిస్తుండగా.. నటి అంజలి ఓ స్పెషల్​ సాంగ్​లో అలరించనుంది. ఈ మాస్​ సాంగ్​ జులై 8న సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఈ సాంగ్ ప్రోమో రిలీజై ఆకట్టుకుంటోంది. 'రా రా రెడ్డి.. ఐ యామ్​ రెడీ' అంటూ సాగే ప్రోమో శ్రోతలను అలరిస్తోంది. నితిన్​, అంజలి మాస్​ బీట్​ స్టెప్స్​ అదిరిపోయాయి. కాగా, నితిన్​ కలెక్టర్​గా కనిపించనున్నారు. ఆదిత్య మూవీస్​ ఎంటర్​టైన్​మెంట్స్​, శ్రేష్ఠ్​ మూవీస్​ బ్యానర్లపై ఎన్​.సుధాకర్​ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ఈ చిత్ర పోస్టర్లు, గ్లింప్స్​ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Parampara season 2 trailer: "నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మర్చిపోయినట్టు ఉన్నావ్‌.. మళ్లీ చూపిస్తా" అని అంటున్నారు ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'పరంపర సీజన్‌ 2' ట్రైలర్‌ను మెగాహీరో రామ్‌చరణ్‌ విడుదల చేశారు. "ఈ యుద్ధం ఎవరి కోసం మొదలుపెట్టావో గుర్తుంది కానీ.. ఎందుకోసం మొదలుపెట్టావో గుర్తులేదు" అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. "స్వేచ్ఛ కోసం. మా నాన్న దగ్గర లాక్కున్న అధికారం.. పోగొట్టుకున్న పేరు.. కోల్పోయిన జీవితం.. అన్నీ తిరిగి కావాలి", "నాయకుడు అధికారాన్ని కోరుకోవడం కాదు. అధికారమే నాయకుడ్ని వెతుకుంటూ వస్తుంది" అంటూ నవీన్‌చంద్ర చెప్పే డైలాగ్స్‌ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్పెషల్‌గా విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన సిరీస్‌ 'పరంపర'కు కొనసాగింపుగా ఇది సిద్ధమైంది. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల మధ్య అధికార, ఆధిపత్య పోరు కోసం పోరాటం జరిగిన నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో మురళీ మోహన్‌, జగపతిబాబు, శరత్‌కుమార్‌, నవీన్‌ చంద్ర, కస్తూరి, ఆకాంక్ష సింగ్‌ తదితరులు నటించారు. జులై 21 నుంచి 'పరంపర సీజన్‌-2' అందుబాటులోకి రానుంది.

Aadi Saikumar crazy fellow release date: ఆది సాయికుమార్‌ కథా నాయకుడిగా శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై 'క్రేజీఫెలో' చిత్రం తెరకెక్కింది. దిగంగన సూర్యవంశీ, మర్నా మేనన్‌ కథానాయిక. ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహించారు. కె.కె.రాధామోహన్‌ నిర్మాత. తాజాగా ఈ సినిమా రిలీజ్​ డేట్​ను ఖరారు చేసుకుంది. సెప్టెంబరు 16న థియేటర్లలో విడుదల కానుంది. దీంతోపాటే ఓ కొత్త పోస్టర్​ను రిలీజ్​ చేశారు మేకర్స్​. పూర్తిస్థాయి వినోదంతో రూపొందుతున్న చిత్రమిది అని సినీ వర్గాలు తెలిపాయి. ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌-సంగీతం, సతీష్‌ ముత్యాల-ఛాయాగ్రహణం, కొలికపోగు రమేష్‌-కళ, సత్య గిడుతూరి-కూర్పు, రామకృష్ణ-పోరాటాలు అందిస్తున్నారు.

ఇదీ చూడండి: పాకిస్థాన్​లో అడివిశేష్​ 'మేజర్​' రికార్డు.. ఆ జాబితాలో అగ్రస్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.