Oscar Race 2024 Indian Movie : కేరళలో విధ్యంసం సృష్టించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ చిత్రం '2018 - ఎవ్రీ వన్ ఈజ్ హీరో' సినిమాకు ఓ అరుదైన గౌరవం దక్కింది. భారత్ తరఫున ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల కోసం జరిగే నామినేషన్ ప్రకియలో భారత్ నుంచి ఈ సినిమా ఆస్కార్ రేసులోకి దిగింది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది.
Oscars 2024 2018 Movie : '2018 - ఎవ్రీ వన్ ఈజ్ హీరో' మలయాళ యువ కథానాయకుడు టోవినో థామస్ కీలక పాత్రలో నటించారు. లాల్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, తన్వి రామ్, అపర్ణ బాల మురళి, కున్‌చకో బోబన్, అజు వర్గీస్, నరైన్, కలైయారసన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక్కరు అని కాకుండా... ప్రతి ఒక్కరిదీ కథలో కీలక పాత్రే. అందరూ అద్భుతంగా నటించారని చెప్పొచ్చు.
2018 సినిమా ఆస్కార్‌కు ఎంపికైన సందర్భంగా దర్శకుడు జోసెఫ్ ఈటీవీ భరత్‌తో మాట్లాడారు. " ఈ సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అస్కార్ గురించి అసలు ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆస్కార్ గురించి కలలు కంటున్నాను. మా సినిమా భారత్ నుంచి ఆస్కార్‌కి ఎంపికైనందుకు హ్యాపీగా ఉంది. ఈ గుర్తింపు మలయాళ చిత్ర పరిశ్రమ నిర్మాతలు, మలయాళీ ప్రేక్షకులకు అంకితం చేస్తున్నాను. అలాగే నాపై నమ్మకం ఉంచిన నిర్మాతలకు ధన్యవాదాలు" అని జోసెఫ్ అన్నారు.
ఈ చిత్రాన్ని 2018లో కేరళను ముంచెత్తిన వరదల నేపథ్యంలో తెరకెక్కించారు. మే 25న కేరళలో మలయాళ సినిమాగా విడుదల అయ్యింది. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి జాతీయ ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకుంది. కేరళలో వసూళ్ల ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాను మే 26న తెలుగులో బన్నీ వాసు విడుదల చేశారు. ఇప్పుడీ సినిమాను ఆస్కార్స్ 2024కి పంపిస్తుండటంతో కేరళ ప్రేక్షకులు, ఈ సినిమా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-
BIG BREAKING - MOLLYWOOD RECORD GROSSER, THE REAL KERALA STORY, #2018Movie is India's official entry for 2024 Oscars 🔥🔥🔥 pic.twitter.com/MZ9PPuo5WF
— AB George (@AbGeorge_) September 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">BIG BREAKING - MOLLYWOOD RECORD GROSSER, THE REAL KERALA STORY, #2018Movie is India's official entry for 2024 Oscars 🔥🔥🔥 pic.twitter.com/MZ9PPuo5WF
— AB George (@AbGeorge_) September 27, 2023BIG BREAKING - MOLLYWOOD RECORD GROSSER, THE REAL KERALA STORY, #2018Movie is India's official entry for 2024 Oscars 🔥🔥🔥 pic.twitter.com/MZ9PPuo5WF
— AB George (@AbGeorge_) September 27, 2023
ఓటీటీ ద్వారా వీక్షకుల ముందుకు వచ్చిన 'మిన్నల్ మురళి', 'కాలా' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు టోవినో థామస్ పరిచయమే. 'ఆకాశమే నీ హద్దురా' ఫేమ్ అపర్ణా బాలమురళి కూడా సుపరిచితమే. లాల్ వంటి తారాగణం ఉండటంతో తెలుగు ప్రేక్షకులు సైతం సినిమాపై ఆసక్తి చూపించారు. విమర్శకుల నుంచి సైతం సినిమాకు మంచి స్పందన లభించింది.
బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో సెలెక్షన్ కమిటీ చైర్మన్ గిరీశ్ కాసారవల్లి ఈ విషయాన్ని వెల్లడించారు. 16 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీ.. సినీ ఇండస్ట్రీలోని పలు సినిమాలను పరిశీలించి ఈ '2018' మూవీని ఎంపిక చేసిందని ఆయన అన్నారు. అందులో 'ది కేరళ స్టోరీ' (హిందీ), 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ', 'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే' (హిందీ), 'బలగం' (తెలుగు), 'వాల్వి' (మరాఠీ), 'బాప్లియోక్' (మరాఠీ) 'ఆగస్టు 16, 1947' (తమిళం)తో సహా 22 చిత్రాలు ఉన్నాయని తెలిపారు.
-
Malayalam film "2018- Everyone is a Hero" India's official entry for Oscars 2024: Film Federation of India
— Press Trust of India (@PTI_News) September 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Malayalam film "2018- Everyone is a Hero" India's official entry for Oscars 2024: Film Federation of India
— Press Trust of India (@PTI_News) September 27, 2023Malayalam film "2018- Everyone is a Hero" India's official entry for Oscars 2024: Film Federation of India
— Press Trust of India (@PTI_News) September 27, 2023
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తెలుగులోనూ '2018' బ్లాక్‌బస్టర్ హిట్.. 10 రోజుల్లో రూ.10 కోట్లు!
మలయాళీ సినిమా రికార్డ్.. రూ.15కోట్ల బడ్జెట్.. పది రోజుల్లోనే రూ.100కోట్లు