ETV Bharat / entertainment

'ఆస్కార్​ వేదికపై 'నాటు నాటు'కు అందుకే డ్యాన్స్​ చేయట్లేదు.. కానీ'

ఆస్కార్​ వేదికపై నాటు నాటు పాటకు ఆర్ఆర్ఆర్​ హీరోలు రామ్​చరణ్​, ఎన్టీఆర్ డ్యాన్స్​ వేస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై ఎన్టీఆర్​ స్పందించారు. తాము డ్యాన్స్​ చేయట్లేదని క్లారిటీ ఇచ్చారు. అందుకు గల కారణాన్ని కూడా తెలియజేశారు. అదేంటంటే?

Etv RRR
RRR
author img

By

Published : Mar 10, 2023, 3:39 PM IST

ఆస్కార్​ వేడుకలు మరో రెండు రోజుల్లో అట్టహాసంగా జరగనున్నాయి. అయితే వేడుకలకు సమయం దగ్గరపడుతుండడం వల్ల ఆర్ఆర్​ఆర్​ చిత్ర బృందం.. వరుస ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడుపుతోంది. విదేశీ అభిమానులతో సందడి చేస్తుంది. ఆస్కార్​ వేడుకలకు హాజరయ్యేందుకు ఇటీవలే అమెరికా చేరుకున్న హీరో జూనియర్​ ఎన్టీఆర్​.. అక్కడ ఫ్యాన్స్​తో సందడి చేస్తున్నారు. ఇంటర్వ్యూలు ఇస్తూ జోష్​ నింపుతున్నారు. ఇక తమ అభిమాన హీరోలు ఆస్కార్‌ వేడుకలో రెడ్‌ కార్పెట్‌పై నడిచే రోజు కోసం సినీప్రియులంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ విదేశీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్​ రెడ్‌ కార్పెట్‌పై నడవడం గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

"అక్కడ నడవనుంది జూనియర్‌ ఎన్టీఆర్‌ లేదా కొమురం భీమ్‌ అని నేను అనుకోను. అలాగే రాజమౌళి, రామ్‌ చరణ్‌ అని కూడా అనుకోవడం లేదు. రెడ్‌ కార్పెట్‌పై నడిచేటప్పుడు మేము మొత్తం భారతదేశాన్ని మా హృదయాల్లో మోయనున్నాం, నేను ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. అలాగే ఆస్కార్‌ వేదికపై నాటు నాటు పాటను లైవ్‌లో చూడాలని ఆసక్తిగా ఉన్నాను. మేము ఆ పాటకు డ్యాన్స్‌ వేస్తామని కచ్చితంగా చెప్పలేను. నాకు, రామ్‌ చరణ్‌కు రిహార్సల్స్‌ చేసే సమయం లేదు. అందుకే మేము ఆస్కార్‌ వేదికపై డ్యాన్స్‌ చేయలేకపోతున్నాం. ఆ పాటను ఎప్పుడు విన్నా నా కాళ్లు డాన్స్‌ చేస్తూనే ఉంటాయి" అని చెప్పారు.

ఫేవరెట్​ డైరెక్టర్​తో చరణ్​..
ఆస్కార్‌ వేడుకల నేపథ్యంలో అమెరికా పర్యటనలో ఉన్న సినీనటుడు రామ్‌చరణ్‌ ప్రముఖ హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ జేజే అబ్రమ్స్‌ను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న రామ్‌చరణ్‌.. ఆయనకు తాను పెద్ద ఫ్యాన్‌ అని తెలుపుతూ పోస్టు పెట్టారు. అబ్రమ్స్‌ను కలవడం ఆనందాన్నిచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. మెగా అభిమానులు తెగ మురిసిపోతున్నారు. గ్లోబల్​ హీరో రామ్​చరణ్​ అంటూ ఫొటోను రీషేర్​ చేస్తున్నారు.

హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ జేజే అబ్రమ్స్​తో రామ్​చరణ్​

మార్వెల్​ స్టూడియోస్​ చిత్రానికి రాజమౌళి డైరెక్షన్​!
మార్వెల్ స్టూడియోస్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రాజమౌళికి దక్కితే తాము భారీ పార్టీని నిర్వహిస్తామని రామ్ చరణ్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి.. మార్వెల్​ చిత్రానికి దర్శకత్వం వహిస్తే మీ ఫీలింగ్​ అని ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు. "వావ్.. అలా జరిగితే మేము మీకు పెద్ద పార్టీని ఏర్పాటు చేస్తాం. అది జరుగుతుందని నేను నిజంగా ఆశిస్తున్నాను" అని చెర్రీ చెప్పారు. మార్వెల్ లేదా స్టార్ వార్స్ ఫ్రాంచైజీలో నటించాలనుకుంటున్నారా అని అడిగ్గా.. సినిమా మెచ్చుకునే ఏ దేశంలోనైనా నటిస్తానని తెలిపారు.

నాటు నాటుకు ఆస్కార్​ రానుందా?
ఆర్​ఆర్​ఆర్​ సినిమాలోని నాటు నాటు పాట ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకుంది. మన దేశంతోపాటు విదేశాల్లోనూ ఈ పాటకు అనేక మంది అభిమానులు ఉన్నారు. ఎందరో సెలెబ్రిటీలు ఈ పాటకు చిందులేసి వీడియోలు పోస్ట్​ చేశారు. ఇటీవలే ఈ పాట ఆస్కార్​ నామినేషన్​ కూడా దక్కించుకుంది. ఈ పాటకు ఆస్కార్ అవార్డు​ రావాలని ఎంతోమంది కోరుకుంటున్నారు. ఆస్కార్​ వేదికపై తెలుగు సింగర్లు.. నాటు నాటు పాట లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. గాయకులు రాహుల్​ సిప్లిగంజ్​, కాలభైరవ.. ఆ పాటను ఆలపించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య నిర్మించారు. ఆలియాభట్‌, అజయ్‌ దేవగణ్​, శ్రియ, ఒలివియా మోర్రీస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా గతేడాది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా రూ.1200కోట్లు వసూలు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.