ETV Bharat / entertainment

'గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన' - థ్రిల్లింగ్​గా సందీప్​ మూవీ ట్రైలర్ - Ooru Peru Bhairavakona release date

Ooru Peru Bhairavakona Trailer : సందీప్ కిషన్​ ప్రధాన పాత్రలో వీఐ ఆనంద్​ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైవరకోన'. సస్పెన్స్​ థ్రిల్లర్​గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్​ ట్రైలర్​ను విడుదల చేశారు.

Ooru Peru Bhairavakona Trailer
Ooru Peru Bhairavakona Trailer
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 12:58 PM IST

Updated : Jan 18, 2024, 1:30 PM IST

Ooru Peru Bhairavakona Trailer : యంగ్ హీరో సందీప్​ కిషన్​, వర్ష బొల్లమ్మ లీడ్​ రోల్స్​లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైవరకోన'. ఏకే ఎంటర్​టైన్​మెంట్స్​ నిర్మిస్తున్న ఈ సినిమాను 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్​ వీఐ ఆనంద్​ తరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం థిల్లింగ్​ సాగిన ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 'టైగర్‌' తర్వాత సందీప్‌ కిషన్‌, వీఐ ఆనంద్‌ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది కావడం విశేషం.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే తొలుత లవ్​ సాంగ్​తో మొదలైన ఈ ట్రైలర్ ఆ తర్వాత ఒక్కసారిగా భైరవకోన అనే ప్రపంచంలోకి వెళ్లిపోతుంది. గరుడ పురాణం, కర్మ సిద్ధాంతం అనే రెండు అంశాల గురించి ఈ సినిమాలో మాట్లాడారని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ' గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన', 'భగవంతుడు ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం. లిఖించబడిందే జరుగుతుంది, రక్తపాతం జరగని' అనే డైలాగ్​తో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Ooru Peru Bhairavakona Cast : ట్రైలర్​లోని విజువల్స్, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు మరింత ప్లస్ పాయింట్​గా నిలిచాయి. అయితే ఇందులో హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా రౌడీలతో ఫైట్ చేయడం ట్రైలర్​లో చూపించారు. ఆ షాట్​ని బట్టి ఇందులో ఆమె పాత్ర కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమెతో పాటు కావ్య, వెన్నెల కిశోర్​ కీలక పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్​ సమర్పణలో హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా ఈ చిత్రాన్నికి నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్​, సాంగ్స్​ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా 'నిజమేలే చెబుతున్నా' అనే సాంగ్​ మ్యూజిక్​ లవర్స్​ను తెగ ఆకట్టుకుంది.

నన్ను కొట్టి 5 రోజుల పాటు తిండి తిప్పలు లేకుండా బంధించారు: సందీప్​ కిషన్

Michael Review: వైలెన్స్​ ఓవర్​లోడెడ్​.. సందీప్​ కిషన్​ 'మైఖేల్'​ ఎలా ఉందంటే?

Last Updated : Jan 18, 2024, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.