ETV Bharat / entertainment

నేషనల్​ అవార్డ్ విన్నర్​తో ఎన్టీఆర్​​ కొత్త సినిమా లేనట్టేనా? - జూనియర్​ ఎన్​టీఆర్​ 32వ సినిమా

కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న ఎన్టీఆర్​ 32వ సినిమా గురించి మరో వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం దీని గురించే సోషల్​మీడియాలో చర్చ నడుస్తోంది. ఆ వివరాలు..

ntr32-with-director vetrimaaran-is-just-a-rumour
వెట్రిమారన్​ జూనియర్​ ఎన్టీఅర్​ కాంబినేషన్​ మూవీ
author img

By

Published : Feb 8, 2023, 7:39 PM IST

గత కొన్ని రోజులుగా జూనియర్​ ఎన్టీఆర్​​ 32వ సినిమాపై పలు ఉహాగానాలు వెలువడుతున్నాయి. జాతీయ అవార్డ్​ గెలుచుకున్న కోలివుడ్​ డైరెక్టర్ ​వెట్రిమారన్ దర్శకత్వంలో తారక్​​.. తన 32వ సినిమా చేయనున్నట్లు కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్​కు వెట్రిమారన్ మూడు కథలు చెప్పాడని అందులో తారక్​​ ఓ కథను ఒకే చేసినట్లు టాలివుడ్​, కోలివుడ్​లో కొన్ని వార్తలు తెగ సందడి చేశాయి. అయితే కోలివుడ్​ వర్గాలు ఈ వార్తలను కొట్టిపారేస్తున్నాయి. ఇందులో ఎటువంటి వాస్తవం లేదంటున్నాయి.ఒకవేళ అది నిజమే అయినా ప్రస్తుతం తారక్​కు ఉన్న బిజీ షెడ్యుల్​లో అది వీలుపడకపోవచ్చు. ఇప్పటికిప్పుడు వెట్రిమారన్​ సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్నా.. సినిమా వచ్చేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్​​, వెట్రిమారన్​ తమ సొంత ప్రాజెక్ట్​ల్లో పుల్​ బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో​​ తన 30వ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ నెలలోనే ఆ సినిమా చిత్రీకరణ సెట్స్​పైకి వెళ్లనుంది. ఆ తర్వాత తారక్​ 31వ సినిమా.. కేజీఎఫ్​ డెరెక్టర్​ ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇవన్ని పూర్తయ్యే సరికి కనీసం సంవత్సరన్నరకు పైగా సమయం పడుతుంది.

మరోవైపు వెట్రిమారన్​ కూడా విజయ్​ సేతుపతి హీరోగా నటిస్తున్న విడుతలై సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత సూర్య హీరోగా వాడివాసల్ అనే సినిమాను రూపొందింటే పనులో బిజీగా ఉంటాడు. ఈ సినిమా భారీ బడ్జెట్​తో రూపొందుతోంది. జల్లికట్టు బ్కాక్​డ్రాప్​తో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణకు కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశముంది. కాబట్టి తారక్​, వెట్రి.. ఇద్దరు మరో రెండేళ్ల వరకు ఫుల్​ బిజీగీ ఉన్న కారణంతో.. ఈ ఇద్దరి కాంబినేషన్​లో సినిమా వస్తుందనే వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.