Nitin Gadkari Biopic : ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన '800'.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే.. భారత రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జీవితం వెండితెరపై రానుంది. 'గడ్కరీ' పేరుతో రూపొందిన ఈ బయోపిక్ అక్టోబరు 27న విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం పోస్టర్‌ని రిలీజ్ చేసింది.
-
BIOPIC ON NITIN GADKARI TO RELEASE ON 27 OCT… OFFICIAL POSTER LAUNCHED… #Gadkari - a #Marathi film based on the life of Hon. Minister #NitinGadkari ji - will release in *cinemas* on 27 Oct 2023… Directed by #AnuragRajanBhusari… Produced by #AkshayAnantDeshmukh… Presented by… pic.twitter.com/J6n8Em980L
— taran adarsh (@taran_adarsh) October 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">BIOPIC ON NITIN GADKARI TO RELEASE ON 27 OCT… OFFICIAL POSTER LAUNCHED… #Gadkari - a #Marathi film based on the life of Hon. Minister #NitinGadkari ji - will release in *cinemas* on 27 Oct 2023… Directed by #AnuragRajanBhusari… Produced by #AkshayAnantDeshmukh… Presented by… pic.twitter.com/J6n8Em980L
— taran adarsh (@taran_adarsh) October 6, 2023BIOPIC ON NITIN GADKARI TO RELEASE ON 27 OCT… OFFICIAL POSTER LAUNCHED… #Gadkari - a #Marathi film based on the life of Hon. Minister #NitinGadkari ji - will release in *cinemas* on 27 Oct 2023… Directed by #AnuragRajanBhusari… Produced by #AkshayAnantDeshmukh… Presented by… pic.twitter.com/J6n8Em980L
— taran adarsh (@taran_adarsh) October 6, 2023
ఆ విషయాన్ని సస్పెన్స్‌లో పెట్టిన టీమ్
Nitin Gadkari Movie Release Date : బయోపిక్ అనగానే ఆయా నిజ జీవిత పాత్రల్లో నటించింది ఎవరా? అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. ఈ సినిమా విషయంలో కూడా అలానే ఉంది. అయితే, ఇప్పటి వరకు.. ఈ సినిమాలో నితిన్ గడ్కరీ పాత్ర పోషించిన నటుడి వివరాలను వెల్లడించకుండా సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది చిత్ర బృందం. విడుదల చేసిన పోస్టర్‌లో ప్రధాన పాత్రధారి లుక్ ఉన్నా అది వెనకకు తిరిగి ఉంటుంది. దీంతో ఆయన ఫేస్ కనిపించడం లేదు. విడుదలకు 21 రోజుల సమయమే ఉన్నా హీరో ఎవరో చెప్పకపోవడం గమనార్హం. మరికొన్ని రోజుల్లోనైనా ఆ డిటైల్స్ రివీల్ చేస్తారా? లేదా నేరుగా తెరపైనే ఆ హీరోని పరిచయం చేస్తారా? అంటే వేచి చూడాల్సిందే.
ఇతర భాషల్లో వస్తుందా?
Nitin Gadkari Film Cast And Crew : అయితే, ఈ బయోపిక్‌కు అనురాగ్ రాజన్ భూసరి దర్శకత్వం వహించారు. అక్షయ్ అనంత్ దేఖ్‌ముఖ్ నిర్మాతగా వ్యవహరించారు. నితిన్ గడ్కరీ వ్యక్తిగతం, రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది? ఇలా తదితర అంశాలతో రూపొందింది. మరాఠీలో తీసిన ఈ సినిమా ఇతర భాషల్లో వస్తుందా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదు. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ.. అనంతరం బీజేపీలో చేరి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గడ్కరీ.. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున జాతీయ రహదారులను నిర్మించారు. గడ్కరీని హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగానూ సంభోదిస్తారు.
Bhagavanth Kesari Trailer : 'భగవంత్ కేసరి' ట్రైలర్ రిలీజ్ అక్కడే.. టైం 'లాక్' చేసిన మూవీ యూనిట్